Reading Time: < 1 minute

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలనే మోసం చేస్తున్న ముఠా

Caption of Image.

కారేపల్లి, వెలుగు: నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా కారేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా కీలక సూత్రధారి కారేపల్లికి చెందిన ముందాడ రామచందర్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకుని కారు, నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

సింగరేణి సీఐ సాగర్ వివరాల ప్రకారం.. రామచందర్ రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైనవిగా నమ్మించి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందాడు. ప్రైవేట్ గోల్డ్ సంస్థలను కూడా మోసం చేసినట్లు గుర్తించారు.

ఈ క్రమంలో ఇల్లందులోని ముత్తూట్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌లో 52 గ్రాముల నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.3.90 లక్షలు తీసుకున్నాడు. అనంతరం హైదరాబాదులోని మనీ గోల్డ్ కంపెనీ నుంచి రూ.5.80 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామచందర్‌‌‌‌‌‌‌‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. మరో నిందితుడు రాకేశ్​ పరారీలో ఉన్నాడని, కేసులో మరికొందరి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని సీఐ తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.