ఈ మధ్యకాలంలో చాలా మంది చాటింగ్ చేసుకోవడం కామన్ అయిపోయింది. దీనికే ఎక్కువగా అలవాటు పడిపోయారు. అయితే ఇలా ఒకరి నుంచి ఒకరు మెసేజ్‌లు పంపుకునే సమయంలో, అవతలి వ్యక్తి నుంచి మెసేజ్ రాకపోతే కొంత మందిలో గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. అంతే కాకుండా ఆందోళన టెన్షన్‌కు గురి అవుతుంటారు. నేను ఏమైనా తప్పుగా చేశానా? అని ఆలోచిస్తూ అందోళనకు గురి కావడం జరుగుతుంది. అయితే ఇది కూడా ఒకరకమైన వ్యాధి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిరంతరం ఆన్ లైన్లోఉండటం, స్మార్ట్ ఫోన్ అధికంగా ఉపయోగించడం ఒక మానసికపరమైన ఒత్తిడి కారణం అవుతుందంట.
కలిసినప్పుడు ముఖాముఖి సంభాషించుకునే సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఎందుకు అంటే అర్థాన్ని సులభంగా గ్రహించవచ్చును, అలాగే ముఖ కవళికలు, స్వరం, వంటి వాటి ద్వారా అది ఏ విధమైన మానసిక ఒత్తిడిని కలిగించదు. కానీ ఈ టెక్ట్స్ సంభాషణ వలన ఇవన్నీ లోపిస్తాయి. ఆలోచన విధానం వేరు, కానీ అర్థం అయ్యే విధానం వీరు. దీని వలన అపార్థాలు పెరిగే ఛాన్స్ ఉంటుందంట. నిరంతరం ఆన్లైన్లో ఉండాలనే ఒత్తిడి, మెసేజ్‌లు పంపిస్తూ రిప్లేలు ఇవ్వడం కూడా ఒక వ్యక్తిపై మానసిక ఒత్తిడిని తీసుకొస్తుందంట.
ముఖ్యంగా మీరు ఎవరికి అయినా మెసేజ్ చేసినప్పుడు మీ ప్రవర్తనను మీరు పరిశీలించుకోవాలి అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే, కొంత మందిలో మేసేజ్ చేసిన తర్వాత దానికి రిప్లే రాకపోతే గుండె పదే పదే కొట్టుకోవడం, హార్ట్ బీట్ ఆకస్మికంగా పెరగడం, చిరాకు, ఆందోళన, చేతులు, కాళ్లు వణకడం, శ్వాస తీసుకోవడంలో బరువుగా అనిపించడం, ఛాతిలో బిగుతుగా అనిపించడం జరుగుతుంది.
అంతే కాకుండా మీ ప్రవర్తనలో కూడా పలు మార్పులు చోటు చేసుకుంటాయి. పదే పదే స్క్రీన్ ఆన్ చేయడం, పంపించిన మేసేజ్‌ను పదే పదే చూడటం, భయాందోళనకు గురి అవ్వడం, ఆలస్యంగా రిప్లే వస్తే మానసికంగా కుంగిపోవడం ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమై సంకేతాలను అని చెబుతున్నారు ప్రముఖ కోచ్, హీలర్ , లైఫ్ ఆల్కెమిస్ట్, సైకోథెరఫిస్ట్ అయిన డాక్టర్ చాందిని తుగ్నైట్.
అందువలన పై సంకేతాలు, లక్షణాలు మీలో గనుక గమనించినట్లు అయితే, దానిని నుంచి బయటపడటానికి, ఫోన్ వాడకాన్ని తగ్గిస్తూ రావాలి. అంతే కాకుండా మెసేజ్ చేయడానికి బదులు, ఫోన్లో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. ఒక వేళ మీకు ఎరు అయినా సరే ఆలస్యంగా రిప్లే ఇచ్చినా వారు ఏదో బిజీలో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి తప్ప అపార్ధం చేసుకోకూడదు,. ఒక వేళ మీరు అదే ఆందోళనకు గురి అవుతుంటే, తప్పకుండా వైద్య సహాయం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.




