Reading Time: < 1 minute

SR యూనివర్సిటీలో స్టూడెంట్ మిస్సింగ్

Caption of Image.

హసన్​పర్తి, వెలుగు: ఎస్ఆర్ యూనివర్సిటీలో చేరిన బిహార్‌‌‌‌‌‌‌‌కు చెందిన 16 ఏండ్ల విద్యార్థి అదృశ్యమయ్యాడు. హసన్‌‌‌‌‌‌‌‌పర్తి సీఐ ఏ.మహేందర్ వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లా బిక్రంపూర్ బండే గ్రామానికి చెందిన మహ్మద్ అక్రమ్ హుస్సేన్‌‌‌‌‌‌‌‌కు ఎస్ఆర్ యూనివర్సిటీలో అడ్మిషన్ రావడంతో జులై 28న ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ ద్వారా రూ.31 వేల ఫీజు చెల్లించాడు.

అనంతరం తండ్రి స్నేహితుడు మోబినుద్దీన్‌‌‌‌‌‌‌‌తో కలిసి యూనివర్సిటీకి వచ్చి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మరో రూ.99 వేల ఫీజు చెల్లించి హాస్టల్‌‌‌‌‌‌‌‌లో చేరాడు. మోబినుద్దీన్ వెళ్లిన తర్వాత జులై 29న విద్యార్థి తండ్రి ఫోన్ చేసినా స్పందన రాలేదు. హాస్టల్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించగా విద్యార్థి కనిపించకపోవడంతో బంధువు సాద్ అహ్మద్ వకాస్ అల్ సబా హసన్‌‌‌‌‌‌‌‌పర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు.

©️ VIL Media Pvt Ltd.