Reading Time: < 1 minute

జూరాల వరదతో ప్రజలు అలర్ట్గా ఉండాలి: జోగులాంబ గద్వాల ఎస్పీ

Caption of Image.

గద్వాల, వెలుగు: కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్నందున కృష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని జోగులాంబ గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. శుక్రవారం ఆయన జూరాల ప్రాజెక్టును సందర్శించి వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యమని, వరద మరింత పెరిగితే జిల్లాలో ఆరు గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.  ఎస్పీ వెంట అడిషనల్ ఎస్పీ శంకర్, డీఎస్పీ మొగులయ్య, ఇరిగేషన్ ఆఫీసర్లు ఉన్నారు.

©️ VIL Media Pvt Ltd.