
కోలీవుడ్ దళపతి విజయ్ వేసిన ప్రతి అడుగు ఒక ప్రభంజనమే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తన ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) పార్టీతో సంచలన విజయం నమోదు చేసుకున్నారు. మిత్ర పక్షాల మద్దతుతో తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించారు. సీఎం బాధ్యతలు స్వీకరించిన తక్కువ కాలంలోనే విజయ్ క్రేజ్ ఏ రేంజ్‌కు చేరిందంటే.. తమిళనాడు ప్రభుత్వ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ఫాలోవర్స్ సంఖ్య రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
ఇప్పుడు ఇదే ఊపుతో గ్లోబల్ వేదికపై మరో అరుదైన, మైండ్ బ్లోయింగ్ రికార్డును ఖాతాలో వేసుకున్నారు దళపతి. ప్రముఖ సినిమా డేటాబేస్ సంస్థ ఐఎండీబీ (IMDb) లేటెస్ట్ గా విడుదల చేసిన ‘మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల’ జాబితాలో విజయ్ ఏకంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. గతంలో ఈ లిస్టులో 21వ స్థానంలో ఉన్న విజయ్.. సీఎం అయ్యాక ఏకంగా 19 స్థానాలను దాటుకుంటూ టాప్-2 లోకి దూసుకురావడం ఆయనకున్న అన్‌స్టాపబుల్ క్రేజ్‌కు నిదర్శనం. కాగా, ‘Sapne vs Everyone’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన అంబరీష్ వర్మ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.
సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ నుంచి రాబోతున్న చివరి చిత్రం ‘జననాయగన్’. టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్. వినోథ్ తెరకెక్కిస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే పలు రకాల సెన్సార్ చిక్కులు, అనేక అడ్డంకులను దాటుకున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కావడానికి సిద్ధమవుతోంది.
పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సునామీ సృష్టిస్తుందోనని అటు ఫ్యాన్స్, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. సీఎం హోదాలో థియేటర్లలోకి రానున్న విజయ్ చివరి సినిమా కాబట్టి, ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్‌గా నిలవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
New week, new faces at the top of Popular Indian Celebrities! 🌟
See the complete list on the IMDb app, available on iOS and Android. 🍿 pic.twitter.com/DaRJQtoPRq
— IMDb India (@IMDb_in) May 12, 2026