Reading Time: 2 minutes

బుర్ర హీటెక్కితే దీన్ని మించిన మందు లేదు.. 20 నిమిషాల్లో మానసిక ఆందోళన మాయం!

Caption of Image.

ఈ రోజుల్లో మానసిక ఆందోళన.. యాంగ్జైటీ లేని వాళ్లెవరు.. దాదాపు 99 శాతం అందరూ దాని బాధితులే. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వచ్చిన తర్వాత కాసేపు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి.. కాసేపు మన గురించి మనం ఆలోచించడానికి సమయం కేటాయించే పరిస్థితి ఉందా. అందుకే ఇప్పుడు యాంగ్జైటీ అనేది ఒక రోగంలా ఎంతో మందిని వేధిస్తోంది. 

యాంగ్జైటీ  బాడీని, మైండ్ ను రెండింటిపైనా ప్రభావం చూపుతుంది. తెలియని ఆందోళన, రెస్ట్ లేనట్లుగా అనిపించడం, గుండె పరుగెడుతున్నట్లు దడదడ, ఏదైనా పనిపై కాన్సంట్రేట్ చేయలేకపోవడం, నిద్ర పట్టకపోవడం.. ఇన్ని అనర్థాలకు కారణం అవుతుంది యాంగ్జయిటీ అనే ఒక్క మానసిక జబ్బు. ఇది శృతిమించినపుడు ప్రొఫెషనల్ ట్రీట్మెంట్ అవసరమవుతుంది. కానీ.. నార్మల్ గా ఒక మోస్తరులో ఉన్నవారికి మాత్రం సింపుల్ రెమెడీతో తగ్గించుకోవచ్చు అంటున్నారు వైద్యులు. అందులో ఒక సింపుల్ హ్యాబిట్.. వాకింగ్. 

ఈ ఫిజికల్ యాక్టివిటీకి ఎలాంటి ఖర్చు, వస్తుసామాగ్రి, జిమ్ మెంబర్ షిప్, ఫిట్ నెస్ స్కిల్స్ లాంటివి అవసరం లేదు. జస్ట్ అలా నడిస్తే చాలు.

యాంగ్జైటీని తగ్గించడంలో నడక ప్రాముఖ్యత..

1. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది

నడవడం ఒత్తిడి  తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు ఆందోళనగా ఉన్నప్పుడు, శరీరం అధిక కాన్సియస్నెస్ తో ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ శరీరంలో  పేరుకుపోయిన ఉద్రిక్తతను తగ్గించేలా తోడ్పడుతుంది.  ఆ తర్వాత మీరు ప్రశాంతంగా ఉండటానికి సహాయపడుతుంది. నడకను ఒక సాధారణ అలవాటుగా చేసుకోవడం వల్ల, రోజువారీ ఒత్తిడికి మీ శరీరం స్పందించే విధానం కూడా మెరుగుపడుతుంది.

2. మూడ్ ను మారుస్తుంది..

శారీరక శ్రమ మెదడులో మానసిక స్థితి, శ్రేయస్సుతో ముడిపడి ఉన్న కెమికల్స్ విడుదలను ప్రేరేపిస్తుంది. నడక, ముఖ్యంగా క్రమం తప్పకుండా చేసినప్పుడు, సహజంగా మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

3.  ఆందోళన నుంచి డైవర్ట్ చేస్తుంది..

ఆందోళనలో తరచుగా ఒకే విషయం గురించి పదేపదే ఆలోచించచి మరింత ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. వాకింగ్ ఏదైనా పనిపైనా.. వస్తువు పైనా కాన్సంట్రేట్ చేసేలా.. అటెన్షన్ పెరిగేలా చేస్తుంది.  మీరు మీ పరిసరాలపై, మీ శ్వాసపై, మీ శరీర కదలికపై లేదా కేవలం మీ లక్ష్యంపై దృష్టి పెట్టవచ్చు. ఈ మార్పు ఆందోళనకరమైన ఆలోచనల నుంచి టెంపరరీ రిలీఫ్ ను అందిస్తుంది.

4. ఇంట్లో కంటే బయట బెటర్

ఇంట్లో నడవటం కంటే బయట నడవడం వల్ల సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి, పచ్చదనం, మారుతున్న పరిసరాల ద్వారా అదనపు ఉత్తేజం లభిస్తుంది. నార్మల్ టెంపరేచర్ లో వాకింగ్ చేస్తూ గడపడం మెంటల్ వెల్ బీయింగ్ తో ముడిపడి ఉంటుంది. రోజువారీ ఒత్తిడి లేదా తేలికపాటి ఆందోళనతో బాధపడేవారికి, పార్కులో లేదా ప్రశాంతమైన ప్రదేశంలో నడవడం విశ్రాంతినిస్తుందని చెబుతున్నారు.

5. మంచి నిద్ర, శ్వాస 

యాంగ్జైటీ కారణంగా  సరిగా నిద్ర పట్టకపోవడం పెద్ద సమస్య. క్రమం తప్పని శారీరక శ్రమ ఆరోగ్యకరమైన నిద్రకు  తోడ్పడుతుంది. మంచి నిద్రతో  పగటిపూట ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది కాబట్టి.. మంచి నిద్ర కోసం.. ఒత్తడి, ఆందోళనను తగ్గించుకునేందకు  నడవడం ఉత్తమమైన మార్గం. 

యాంగ్జైటీ  కొన్నిసార్లు వేగవంతమైన శ్వాసకు దారితీస్తుంది.  కాస్త వేగంతో నడవడం వలన శ్వాసలో స్థిరత్వం వచ్చి బాడీకి మంచి ఆక్సిజన్ అందేలా చేస్తుంది. అదేవిధంగా నడిచేటప్పుడు శ్వాసపై  దృష్టి పెట్టడం వలన మైండ్‌ఫుల్‌నెస్ పెరుగుతుంది. 

ఫోన్‌లు, సోషల్ మీడియా కారణంగా మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. నడవడం వలనస్క్రీన్‌లకు దూరంగా ఉండే అవకాశాన్ని అందిస్తుంది. ఫోన్‌ను పక్కన పెట్టడం, లేదా దానిని కేవలం మ్యూజిక్ వినడానికి  ఉపయోగిస్తే.. మెంటల్ బ్రేక్ గా మారుతుందని చెబుతున్నారు. 

ఎంత దూరం నడవాలి?

ఇంత దూరమే నడవాలి అనే నియమం అంటూ ఏదీ లేదు. బాడీ తీరును బట్టి ఒక్కొక్కరికి కొంత సరిపోతుంది. మీరు ఫిజికల్ గా యాక్టివ్ గా లేకపోతే, 10 నుండి 15 నిమిషాల నడక సరిపోతుంది. మొదట్లో 15 నిమిషాలు చేయండి.. ఆ తర్వాత మెల్ల మెల్లగా పెంచుతూ పోవడం బెటర్. చాలా మందికి 20 నుంచి 30 నిమిషాల పాటు వేగంగా, ఒత్తిడితో నడవడం అలవాటు ఉంటుంది.  మిమ్మల్ని మీరు చాలా వేగంగా లేదా ఎక్కువ సేపు నడవమని బలవంతం చేసుకోవడం కంటే, నిలకడగా ఉండటమే ముఖ్యం.

రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి, మానసిక ఆరోగ్యానికి తోడ్పడటానికి నడక ఉపయోగపడుతుంది, కానీ ఆందోళన మరి ఎక్కువగా ఉంటే వాకింగ్ మాత్రం పరిష్కారం. అంత తీవ్రత ఉన్నవాళ్లు డాక్టర్ ను సంప్రదించడం బెటర్. 

©️ VIL Media Pvt Ltd.