Reading Time: < 1 minute

Amul Milk Price: పాల ధర పెంచిన అమూల్.. రేపటి(మే14) నుంచే అమలు

Caption of Image.

ప్రముఖ పాల ఉత్పత్తిదారుల కంపెనీ అమూల్ పాల ధరలు పెంచింది. లీటర్ కు 2రూపాయల చొప్పున పెంచింది. ఈ ధరల సవరణ అమూల్ స్టాండర్డ్ మిల్క్, బఫెలో మిల్క్, గోల్డ్, స్లిమ్,  ట్రిమ్, టి-స్పెషల్, తాజా ఆవు పాలు వంటి కీలక పాల ఉత్పత్తులకు వర్తిస్తుంది.పెరిగిన కొత్త ధరలు మే 14 అంటే రేపటినుంచే అమలులోకి రానున్నాయి. అమూల్ పాల ధరల పెంపుతో  సామాన్యుడిపై మరింత భారం పడనుంది. అన్ని పాల రకాలపై కూడా ప్రభావం చూపనుంది. గతంలో మే 1, 2025న అమూల్ పాల ధరలను పెంచారు. 

మే 14 నుంచి భారతదేశవ్యాప్తంగా అమూల్ కు చెందిన అన్ని రకాల పాల ధరలను లీటరుకు రూ.2 మేర పెంచినట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. “పాల ఉత్పత్తి, నిర్వహణ మొత్తం ఖర్చు పెరగడం వల్లే ఈ ధరల పెంపు జరుగుతోంది. ఏడాది పొడవునా పశువుల మేత, పాల ప్యాకేజింగ్ ఫిల్మ్, ఇంధనం ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపింది. 3.5 శాతం పాల ధరలు పెంచినట్లు తెలిపింది. ఆహార ద్రవ్యోల్బణం కంటే తక్కువ అని ఆ సంస్థ చెబుతోంది. 

©️ VIL Media Pvt Ltd.