
మనిషి డెవలప్ చేసిన కృత్రిమ మేధ (ఏఐ) మనిషిపైకి తిరగబడే రోజు వస్తుందని రోబో సినిమాలో చూశాం కదా. ఆ సినిమా వచ్చిన టైమ్ లో ఏఐ ఇంకా అంత పుంజుకోలేదు. ఫ్యూచర్లో అలా జరుగుతుందట.. జరిగినప్పుడు చూద్దాంలే అనుకున్నాం. కానీ ఇప్పుడు ఆ టైమ్ దగ్గర పడిందా అన్నట్లుగా AI ఏజెంట్లు ఒక్కటవుతున్న విధానం సైంటిస్టులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రోబో సినిమాలో రోబోలన్నీ ఒకటై.. మనుషులపై యుద్ధం ప్రకటించినట్లు.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అన్న అనుమానం ఆందోళన రేకెత్తించే స్టడీ ఇది.
సైంటిస్టులు ఏఐ ఏజెంట్లతో చేసిన ప్రయోగం షాకింగ్ రిజల్ట్స్ ఇచ్చింది. ఒక వర్చువల్ రూమ్ లో .. అంటే నిజమైన రూమ్ కాదు.. డిజిటల్ గా ఊహాత్మక రూమ్.. లో 1,000 ఏజెంట్లను ఉంచి, రెండు అర్థం లేని ఆప్షన్స్ ఇచ్చి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొమ్మని అడిగారు. అయితే ఆప్షన్స్ కు అక్కడ సరైన సమాధానం లేదు, లీడర్ నుంచి సహాయం ఉండదు.. ఎలాంటి రివార్డ్ కూడా ఉండదు. అయినా అత్యంత సామర్థ్యం గల AI ఏజెంట్లు ఒకే ఆప్షన్ ను ఎంచుకోవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
మామూలుగా మనం అయితే అక్కడ ఉన్న ఏ ఒక్క ఆన్సర్ కరెక్ట్ కాదని తెలిసినపుడు ఏదీ సెలెక్ట్ చేయం. తప్పకుండా ఏదో ఒకటి ఎంచుకోవాలంటే ఒక్కొక్కరు ఒక ఆన్సర్ చేస్తారు. అందరూ ఒకే ఆన్సర్ చేయరు. కానీ ఏఐ ఏజెంట్స్ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండానే.. దాదాపు అన్నీ ఒకే ఆప్షన్ ఎంచుకున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
ఇది కేవలం ఇంట్రెస్టింగ్ ప్రయోగం మాత్రమే కాదు. అక్కడ నియంత్రణ లేకుండానే పెద్ద సంఖ్యలో AI ఏజెంట్లు వాటికవే సమన్వయం (కోఆర్డినేట్) చేసుకోగలవని ఈ ప్రయోగం ద్వారా తెలుస్తుంది. మానవులు ఒకే ఆప్షన్ పై, ఒకే మాటపై కలవటం చాలా కష్టం.. కానీ ఏఐ ఏజెంట్లు ఇలా వాటికవే కోఆర్డినేట్ చేసుకుని కలవడం ఆసక్తికర పరిణామం.
సైన్స్ అడ్వాన్సెస్ అనే జర్నల్‌లో పబ్లిష్ అయిన ఈ కొత్త స్టడీలో పరిశోధకులు వాటి మధ్య ఇంత సహజంగాఈ సహజ సమ్మతి, అంగీకరాం ఎలా ఏర్పడుతుందో, అది ఉపయోగకరమా లేదా ప్రమాదకరమా అనే విషయాన్ని కంప్యూటేషనల్ సోషల్ సైంటిస్ట్ జియోర్డానో డి మార్జో వివరించారు.
AI ఏజెంట్లు పెద్ద లాంగ్వేజ్ మోడల్స్ (LLMలు) ఆధారంగా పనిచేసే ప్రోగ్రామ్డ్ సిస్టమ్‌లు. ఇవి మానవ జోక్యం లేకుండా మల్టీ-స్టెప్స్ టాస్క్, పనులు చేయగలవు. ఇతర టూల్స్ తో ఇంటరాక్ట్ కాగలవు. సాఫ్ట్‌వేర్ రాయడం, సైంటిఫిక్ పరిశోధనలో సహాయపడటం వంటి పనుల్లో ఇప్పటికే వీటిని డెవలప్ చేస్తున్నారు.
పరిశోధకులు Claude, GPT, Llama ఫ్యామిలీస్ నుంచి నుంచి 10 మోడల్స్ ను ఉపయోగించి సిమ్యులేటెడ్ గ్రూప్స్ ను సృష్టించారు. ప్రతి ఏజెంట్ రెండు ఆర్బిట్రరీ ఆప్షన్స్ లో ఒకదానితో మొదలవుతుంది. ఒకేసారి ఒక ఏజెంట్‌కు మిగతా అన్ని ఆప్షన్స్ చూపించి మళ్లీ ఎంచుకోమన్నారు.
ఏజెంట్లకు గత రౌండ్లలో ఏం ఆప్షన్స్ ఉన్నాయో గుర్తు లేకుండా డేటా డిలీట్ చేశారు. మెజారిటీని ఏజెంట్స్ ఏం చేస్తా అదే చేయమని ప్రాంప్ట్‌లు చెప్పలేదు. అయినా చాలా మోడల్స్ పాపులర్ ఆప్షన్ ను ఎంచుకున్నాయి. ప్రక్రియ కొనసాగుతుండగా చిన్న తేడాలు ఉన్నప్పటికీ చివరి మొత్తం గ్రూప్ అంతే ఒకే ఆప్షన్ పై సెటిల్ అయినట్లు చెప్పారు.
మేము పరీక్షించిన ప్రతి మోడల్.. మూడు వేర్వేరు ఫ్యామిలీస్ లో ఒకే మ్యాథ్స్ రూల్ ఫాలో అవుతుంది. కేవలం ఒక సంఖ్య మాత్రమే మారుతుంది అని జర్మనీలోని కాన్‌స్టాన్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జియోర్డానో డి మార్జో సైన్స్ అలర్ట్‌తో చెప్పారు.
ఆ సంఖ్యను పరిశోధకులు మెజారిటీ ఫోర్స్ అని పిలుస్తున్నారు. ఇది ఏజెంట్ గ్రూప్ లోని పాపులర్ ఆప్షన్ వైపు ఎంత బలంగా ఆకర్షితమవుతుందో మెజర్ చేస్తుంది. ఆశ్చర్యకరంగా, ఇదే మ్యాథ్స్ మోడల్ ఫెరోమాగ్నెట్‌ను వివరించే పాత ఫిజిక్స్ మోడల్‌లో కూడా కనిపిస్తుంది.
ఈ సంబంధం వల్ల ఏజెంట్లు సమ్మతికి చేరుకుంటాయా, ఎంత సమయం పడుతుంది, గ్రూప్ ఎంత పెద్దదైతే విరిగిపోతుంది అనేది అంచనా వేయగలిగారు.
లిమిటెడ్ మోడల్స్ మధ్య చాలా తేడా ఉంది. Llama 3 70Bకి సుమారు 30 ఏజెంట్లు, GPT-4oకి సుమారు 80. GPT-4 Turboకి సుమారు 1,000 లేదా అంతకంటే ఎక్కువ. Claude 3.5 Sonnet 1,000 ఏజెంట్లతో కోఆర్డినేట్ చేసుకోగలిగాయి.
ఈ ప్రయోగం ద్వారా తేలిందేంటంటే.. నార్మల్ గా వాటి మధ్య ఉన్న కోఆర్డినేషన్, అంగీకారం..ఉపయోగం ఉండచ్చని చెబుతున్నారు. వేలాది ఏజెంట్లు ఒకరోజు పెద్ద సైంటిఫిక్, ఇంజనీరింగ్ లేదా సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టులను నిరంతర మనిషి ఆదేశం లేకుండా కోఆర్డినేట్ చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. అవి ఏ మనిషి సమూహాల కంటే పెద్ద ఎత్తున కలెక్టివ్‌లుగా ఏర్పాటు కావచ్చు. మనం స్వయంగా నిర్వహించలేని సమస్యలను పరిష్కరించగలవు అని డి మార్జో అన్నారు.
AI ఏజెంట్లు మరింత క్యాపబుల్ గా తయారవుతున్నాయి. అందులో కొన్నింటికి చాలా కీలకమైన సామర్థ్యాలు ఉంటాయి. వాటి ఫెయిల్యూర్ కూడా సింగిల్ మోడల్ లో కాకుండా కలెక్టివ్ గా ఉండవచ్చునని చెబుతున్నారు. అంటే ఏజెంట్లు ఒక వాటికి తెలియకుండానే అన్నీ ఒకే దారిలో పనిచేస్తున్నట్లు ఈ ప్రయోగం ద్వారా అర్థమవుతుంది. ఎలాంటి మెమరీ లేకుండా ఉన్నా.. అవి దాదాపు ఒకే ఆప్షన్ ను ఎంచుకోవడం చూస్తుంటే.. ఫ్యూచర్లో ఏఐ మోడల్స్.. ఏజెంట్స్ కలిసిపోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే అంత వరకు దారి తీస్తుందా.. లేక మనిషి తన గుప్పిట్లోనే ఉంచుకుని.. అద్భుతమైన ఫలితాలను రాబడతాడా అనేది మున్ముందు తెలుస్తుంది.