Reading Time: 2 minutes

నల్సార్ యూనివర్సిటీ వివాదం.. విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ క్షమాపణ

Caption of Image.

నల్సార్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.  విద్యార్థులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్ పర్సన్ మనన్ కుమార్ మిష్రా  క్షమాపణలు చెప్పారు. విద్యార్థులు ఏ అభిప్రాయాన్నైనా చెప్పే స్వేచ్ఛ కలిగి ఉంటారని అన్నారు. వివిధ వర్గాల నుంచి ముఖ్యంగా సుప్రీం కోర్టు కూడా మందలించడంతో ఆయన ఈ వ్యవహారంలో క్షమాపణ చెప్పారు. 

2026 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా యంగ్ ఫ్రెండ్స్ అని సంబోధిస్తూ లెటర్ రాశారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు తీవ్ర వివాదానికి కారణమైన సందర్భంగా.. తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నా మాటలు, లేఖ లేదైనా లా విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తే.. వారికి క్షమాపణ చెబుతున్నానని లేఖలో పేర్కొన్నారు. 

ఏదైనా మాట్లాడటానికి సందేహం అవసరం లేదు.. విద్యార్థుల విషయంలో క్షమాపణలు చెప్పడంలో ప్రతిష్ట దిగజారిపోదు. అందుకే విద్యార్థులను మన్నించమని అడుగుతున్నానని అన్నారు. వివిధ అంశాలపై స్వేచ్ఛగా అభిప్రాయం చెప్పేలా విద్యార్థులు ఉండాలని.. ఆ విషయంలో తప్పుగా ఆలోచించామని అన్నారు. 

ఇక నల్సార్ కాన్వొకేషన్ కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్య కాంత్ రావాలా వద్దా అనేది విద్యా్ర్థులే డిసైడ్ చేసుకోవాలని.. వారిపై ఒత్తిడి తీసుకురాకూడదని అన్నారు.

ఏంటి వివాదం..?

హైదరాబాద్ లోని నల్సార్ లా యూనివర్సిటీ కాన్వొకేషన్ కు చీఫ్ గెస్ట్ గా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ను ఆహ్వానించడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. విద్యార్థులను, నిరుద్యోగులను కాక్రోచ్ లు అభివర్ణించడంపై ఆయన రాకను వ్యతిరేకిస్తూ.. 400 మంది విద్యార్థులు యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్ కు లేఖ రాశారు. 

దీనిపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని రావద్దని అంటారా..? 2026 బ్యాచ్ విద్యార్థులు దేశంలోని రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో ఎన్ రోల్ మెంట్ చేసుకోకుండా నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీఐ చైర్మన్ మన్నన్ కుమార్ మిశ్రా.. నల్సార్ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావుతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల సెక్రటరీలకు ఆరు పేజీల సర్క్యులర్ జారీ చేశారు. ఈ నిర్ణయం తీవ్ర వివాదం అయిన విషయం తెలిసిందే. 

©️ VIL Media Pvt Ltd.