Reading Time: < 1 minute

సోమవారం తగ్గిన రిటైల్ గోల్డ్ రేట్లు.. అంతా మోడీ ఎఫెక్టేనా..?

Caption of Image.

బంగారం ధరలు సోమవారం కూడా తగ్గుదలను నమోదు చేసాయి. ఆదివారం హైదరాబాద్ పర్యటనలో ప్రజలకు గోల్డ్ కొనుగోలు ఆపాలంటూ ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన వేళ రిటైల్ మార్కెట్లలో గోల్డ్ ధరలు తగ్గటం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో బంగారు ఆభరణాలు షాపింగ్ చేయాలనుకుంటున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా తమ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 

మే 11న బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. మే 10 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.22 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 213గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 945గా కొనసాగుతోంది. 

సోమవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 11, 2026న దేశవ్యాప్తంగా స్థిరంగా ఉంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 75వేల వద్ద మార్పులు లేకుండా కొనసాగుతోంది. అంటే గ్రాము ధర రూ.275గా అమ్మకాలు జరుగుతున్నాయి.  

©️ VIL Media Pvt Ltd.