Reading Time: < 1 minute

పెళ్లై నెల రోజులే అయ్యింది.. భార్య పుట్టింట్లో.. భర్త కాలువలో.. కలకలం రేపుతున్న ఆత్మహత్యలు

Caption of Image.

ఇద్దరు ఇష్టపడ్డారు. పెద్ద వాళ్లను ఎదిరించారు. ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నెల రోజులు గడిచాయో లేదో అంతలోనే ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. .సిద్ధిపేట జిల్లాలో నవదంపతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. 2026 మే 10వ తేదీన జరిగిన ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. 

సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలంలో ఘటన జరిగింది. మనస్థాపం చెంది భార్య భర్తలు ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు. భార్య అంజలి(21) కొమురవెల్లిలోని తన పుట్టింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అదే సమయంలో భర్త వినయ్(23) గజ్వేల్ మండలం రాయవరం మల్లన్నసాగర్ కాలువలో పడి మృతి చెందాడు. 

►ALSO READ | ORRపై యాక్సిడెంట్.. ఓవర్ స్పీడ్ కారు.. కంటైనర్ ట్రక్కును కొట్టేసింది.. సినీ నటుడు స్పాట్ డెడ్ !

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. పోస్టు మార్టం నిర్వహించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే  దంపతుల మధ్య మొబైల్ ఫోన్  చిచ్చు పెట్టినట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

©️ VIL Media Pvt Ltd.