Reading Time: < 1 minute

ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తాం : ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

Caption of Image.
  •     ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, స్పోర్ట్స్​ చైర్మన్​​ శివసేన రెడ్డి

పెబ్బేరు, వెలుగు: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం తరఫున కృషి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శివసేన రెడ్డి తెలిపారు. పెబ్బేరు మండలంలో జరిగిన కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై అభయ ఆంజనేయస్వామి విగ్రహంతో పాటు గణపతి, సీతారాములు, నవగ్రహాలు, శివుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. భారీ ధ్వజస్తంభ ప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. 

పూజారులు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో ఐదు బొడ్రాయిలను  ప్రతిష్ఠించారు. ఈ ఉత్సవాలకు మాజీ మంత్రి నిరంజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.