Reading Time: < 1 minute

నిమ్స్ నర్సు ల యూనియన్ లో విభేదాలు

Caption of Image.

పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ నర్సుల యూనియన్​లో అంతర్గత విబేధాలు బయటపడ్డాయి. సీనియర్లను కాదని డిప్యూటేషన్​పై వచ్చిన వారే అజమాయిషీ చేస్తున్నారంటూ ఓ సీనియర్ నర్సులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  నర్సింగ్ విభాగాధిపతులు కూడా వారికే  వత్తాసు పలకడం ఆవేదన కలిగిస్తోందన్నారు. నర్సులకు విధులు కేటాయించడం, సెలవుల మంజూరు వంటి నిర్ణయాలను కూడా వారే తీసుకుంటున్నారని మండిపడ్డారు. 

పదవీ విరమణకు చేరువలో ఉన్న తమకు కనీస గౌరవం ఇవ్వకుండా, ప్రాంతీయేతరులు ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో నిమ్స్ దవాఖానలోని పరిస్థితులను వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ సెక్రటరీని కలిసి విన్నవించనున్నట్లు ఆమె తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.