Reading Time: < 1 minute
Telangana: సెల్ఫ్ ఎన్యుమరేషన్‌లో బిగ్ ట్విస్ట్.. భద్రాచలాన్ని ఏపీలో చూయిస్తున్న మ్యాప్స్

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జన గణనతో భద్రాచలం వాసుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ చేసేందుకు జన గణన సైట్ లోకి వెళ్ళి లొకేషన్ వివరాలు నమోదు చేస్తుండగా భద్రాచలం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చూపించడం స్థానకంగా ఆందోళనలకు దారిన తీసింది. అయితే జగ గణన చేయాలంటే ముందగా సైట్‌లోకి వెళ్లి ముందుగా రాష్ట్రం, జిల్లా, పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత మనం ఉంటున్న గ్రామం లేదా పట్టణం లొకేషన్ జియో కోడింగ్ చేయాలి. అయితే ఇక్కడే భద్రాచలం వాసులకు షాక్ తగిలింది. భద్రాచలం పట్టణం తెలంగాణ పరిధిలో కాకుండా ఏపీలో ఉన్నట్టు చూపించింది.

ఈ మెసేజ్‌ చూసిన భద్రాచలం వాసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపు పేరుతో ఖమ్మం జిల్లాలో ఉన్న కూనవరం, కుక్కునూరు, వేలేరుపాడు, చింతూరు, వి ఆర్ పురం,బూర్గంపాడు, భద్రాచలం రూరల్ ప్రాంతాలను ఏపీలో విలీనం చేశారు. ఆ తర్వాత భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న 5 గ్రామ పంచాయతీలను కూడా ఏపీలో విలీనం చేశారు.

కేవలం భద్రాచలం పట్టణం మాత్రమే తెలంగాణలో మిగిలి ఉంది. గత కొంత కాలంగా ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపాలని స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో తెలంగాణ ఉన్న భద్రాచలం పట్టణాన్ని కూడా ఏపీలో చూయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. భద్రాచలం పట్టణాన్ని ఏపీలో చూయించడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు తహశీల్దార్. దీనిపై స్పందించిన అధికారులు సెల్ఫ్‌ ఎన్యుమరేషన్‌ విషయంలో తలెత్తన సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.