Reading Time: < 1 minute
Azharuddin Kodandaram Sworn In As Telangana Legislative Council Members

తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాం లతో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు డి. శ్రీధర్ బాబు, వివేక్, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా గవర్నర్ కోటా కింద ఈ ఇద్దరినీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడంతో, దీర్ఘకాల నిరీక్షణ అనంతరం వారు శాసనమండలి సభ్యులుగా ప్రమాణం చేశారు. మంత్రి అజారుద్దీన్ మంత్రి పదవిని కొనసాగించడానికి ఈ ప్రమాణస్వీకారం కీలకమైనది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు అజారుద్దీన్, కోదండరాం లకు అభినందనలు తెలిపారు.