
టాలీవుడ్ ‘చిట్టి’ ఫరియా అబ్దుల్లా తన మనసులో దాచుకున్న ఒక సీక్రెట్‌ను బయటపెట్టింది. సాధారణంగా హీరోయిన్లు తమ ఫేవరెట్ హీరోల గురించి చెబుతుంటారు, కానీ ఫరియా మాత్రం ఏకంగా తన ఇండస్ట్రీ ఎంట్రీకి ఒక హీరోనే కారణమని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ హీరో మరెవరో కాదు.. మలయాళ కుర్రాడు, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫరియా మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాన్ని పంచుకుంది.. ‘నేను మొదటిసారి ‘ఛార్లే’ (Charlie) సినిమా చూసినప్పుడు, అందులోని హీరోయిన్ పాత్రలో నన్ను నేనే ఊహించుకున్నాను. ఆ క్షణం నుంచే దుల్కర్ సల్మాన్‌పై నాకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. నిజం చెప్పాలంటే, ఆయన్ని ఒక్కసారి కలవాలనే కోరికతోనే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ఫిదా అయిపోతాను. ఆయన నటన, స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం’ అంటూ తన ‘ఫ్యాన్ గర్ల్’ మూమెంట్‌ను షేర్ చేసుకుంది. ఫరియా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఇది చూసిన నెటిజన్లు ‘త్వరలోనే ఫరియా-దుల్కర్ కాంబోలో ఒక సినిమా రావాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఫరియా ప్రస్తుతం తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆమె చేతిలో ఉన్నాయి. ఒకవైపు నటిగా రాణిస్తూనే, మరోవైపు మ్యూజిక్ వీడియోలు, డ్యాన్స్‌లతో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది.