Reading Time: < 1 minute
Aap Mps Merge Bjp Rajya Sabha Chairman Approval Bjp Strength Rises

బీజేపీలో ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల చేరికను రాజ్యసభ ఛైర్మన్ సీపీ.రాధాకృష్ణన్ ఆమోదించారు. ఆప్ ఎంపీలు రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, స్వాతి మాలివాల్, హార్బజన్ సింగ్, విక్రమ్ సాహ్నే, రాజేందర్ గుప్తా, సందీప్ పాఠక్ బీజేపీ ఎంపీలుగా పరిగణిస్తూ రాజ్యసభ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం అనూహ్యంగా పుంజుకుంది. 106 నుంచి 113కు చేరుకుంది. అదే సమయంలో ఆప్ ఎంపీల సంఖ్య 3కు పడిపోయింది.

Ar

గత శుక్రవారం ఆప్ ఎంపీలు ఊహించని షాకిచ్చారు. ఏడుగురు ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఇక రాఘవ్ చద్దా, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ స్వయంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ కలిశారు. ఈ సందర్భంగా నితిన్ నబిన్ స్వీట్లు తినిపించారు.

Ke