Reading Time: < 1 minute
Ashu Reddy 9 Crore Cheating Case Media Press Meet Details

నిన్న ఉదయం బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి చుట్టూ ముసురుకున్న చీటింగ్ కేసు వ్యవహారం ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. నిన్న కేవలం తన మీద వస్తున్న ఆరోపణలను ప్రచారం చేస్తున్న వారి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అంశం మీద మౌనంగా ఉన్న అషు రెడ్డి, ఇప్పుడు ఈ ఆరోపణలపై గట్టిగా బదులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామాలు ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. నిన్నంతా అషు రెడ్డి అడ్రస్ లేరంటూ ప్రచారం సాగినప్పటికీ, ఆమె మాత్రం నిన్నంతా ఆధ్యాత్మిక పర్యటనలో గడిపారు అని ఆమె సోషల్ మీడియా అకౌంట్లు చూస్తే క్లారిటీ వచ్చింది.

వరుసగా పలు దేవాలయాలను సందర్శించిన ఆమె, నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. మరోవైపు, ఈ వివాదం ముదురుతుండటంతో ఆమె తండ్రి కూడా వైజాగ్ నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ ఆరోపణలను తిప్పికొట్టేందుకు, చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై తండ్రీకూతుళ్లిద్దరూ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈరోజు అషు రెడ్డి తన తండ్రితో కలిసి మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, అసలు ఏం జరిగింది? తనపై వస్తున్న ఆరోపణల్లో నిజమెంత? అనే విషయాలపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ కేసులో ప్రధానంగా భారీ మొత్తంలో ఆన్‌లైన్ నగదు బదిలీ జరిగిన క్రమంలో పోలీసుల దర్యాప్తు ఇప్పుడు అషు రెడ్డికి ఇబ్బందికరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.