Reading Time: < 1 minute
West Bengal Tamil Nadu Phase 1 Elections Voting Begins

తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో ఫేజ్-1 ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బెంగాల్‌లో మొత్తం 294 స్థానాలు ఉండగా ఈరోజు 152 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. సుమారు 3.6 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ-తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఫైటింగ్ జరుగుతోంది. ఇక తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ డీఎంకే-ఎన్డీఏ కూటమి, టీవీకే పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది.  234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 5.73 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఇక రెండో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. అనంతరం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.