Reading Time: 2 minutes
Rishabh Pant Shocking Comments After Lsg Defeat Vs Rajasthan Royals Ipl 2026

Rishabh Pant: నిన్న గుజరాత్‌లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు లక్నో సూపర్ జెయింట్స్(LSG)పై 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజస్థాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, లక్నో 18 ఓవర్లలో 119 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా(43) రాణించాడు. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఘోర పరాజయం అనంతరం.. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తామ టీమ్ చెత్త బ్యాటింగ్ వల్లే ఓడిపోయామని స్పష్టం చేశాడు. జట్టు ఓటమికి ప్రధాన కారణం బ్యాటింగే అని పంత్ అంగీకరించాడు. తాను సైతం నిందించుకున్నాడు. తనతో పాటు బ్యాటర్లందరూ విఫలమయ్యారన్నాడు. బౌలర్లు గత మ్యాచ్ కంటే మెరుగ్గా రాణించి తమ పనిని చక్కగా పూర్తి చేశారని కొనియాడాడు. కానీ బ్యాటర్లే తమ బాధ్యతను నెరవేర్చలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఓటమికి కారణాలను బయట ఎక్కడో వెతకడం కంటే, జట్టు లోపలే వెతుక్కోవాలని పంత్ సూచించాడు. జట్టుగా అందరూ నిరాశలో ఉన్నప్పటికీ, పరిష్కార మార్గాలను కనుగొనడం ముఖ్యమని చెప్పాడు. బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు క్రీజులో కొంచెం డీలే అవుతుందన్నాడు. బ్యాటింగ్ సమయంలో మేం కాస్త టైమ్ తీసుకొని ఆడాల్సిందని తెలిపాడు. ఈ విషయంలో తనతో సహా బ్యాటర్లందరూ బాధ్యత వహించాలని స్పష్టం చేశాడు. తమ జట్టులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తగినంత సత్తా (firepower) ఉందని పంత్ ధీమా వ్యక్తం చేశాడు. జట్టుగా ఈ ఓటమి తమకు నిరాశ కలిగిస్తుందని.. కానీ తాము ఇంకా సానుకూల అంశాల వైపే చూడాలనుకుంటున్నామన్నాడు. తమ బలహీనతలను సరిదిద్దుకోవాలని.. బౌలింగ్, బ్యాటింగ్‌లో ఫైర్ పవర్ ఉందన్నాడు. తాము కచ్చితంగా పుంజుకుంటామని నమ్మకం వ్యక్తం చేశాడు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 159 పరుగులు చేసింది. ఇక 160 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ రంగంలోకి దిగిన లక్నోకు ఆరంభంలోనే చెతికిలపడింది. తొలి ఓవర్‌లోనే ఆయుష్ బదోని రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అనంతరం ఐడెన్ మార్క్రమ్ సైతం ఖాతా తెరవడంలో విఫలమయ్యాడు. లక్నో టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో ముగ్గురు డకౌట్‌ అయ్యారు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ అర్ధశతకం సాధించాడు. అయితే, మార్ష్ సైతం అవుట్ అవ్వడంతో లక్నో జట్టు తీవ్రంగా తడబడింది. 119 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో లక్నో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పడిపోయింది.