
నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ డేస్ లో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. వరుసగా హిట్స్ మీద హిట్స్ అందుకుంటున్నారు బాలయ్య. ఇటీవలే అఖండ 2 సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు బాలకృష్ణ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వీరసింహారెడ్డి సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలయ్యే కాదు మెగాస్టార్ చిరంజీవి కూడా వరుస సినిమాలతో రాణిస్తున్నారు.
సౌందర్య ఆ స్టార్ హీరోతో సినిమా చేయాల్సింది.. కానీ అతను చెప్పిన ఒకే ఒక్క మాటతో..
ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాకు బాలకృష్ణ క్లాప్ కొట్టారని మీకు తెలుసా.? అవును చిరంజీవి సినిమాకు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. ఆ సినిమా కాస్త ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇంతకూ ఆ సినిమా ఎదో తెలుసా.? ఆ సినిమా మరేదో కాదు.. ఘరానా మొగుడు.
తల్లి దండ్రులకు కర్మకాండలు చేయలేకపోయా..! బంధువులందరూ తిట్టారు.. ఎమోష్నల్ అయిన హీరో
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకుంది. చిరంజీవికి జోడీగా నగ్మా, వాణి విశ్వనాథ్ నటించారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని భారీ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా ముహూర్తం పూజాకార్యక్రమానికి బాలకృష్ణ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే ముహూర్తం షాట్ కు బాలకృష్ణ క్లాప్ కొట్టారు. ఇటీవలే 34ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమా అప్పట్లో పది కోట్లకుపైగా షేర్ వసూళ్లని రాబట్టింది. టాలీవుడ్‌లో ఫస్ట్ పది కోట్ల షేర్‌ని సాధించిన సినిమా ఇదే.