Reading Time: 2 minutes
PM Kisan: పీఎం కిసాన్‌ 23వ విడత ఎప్పుడు వస్తుంది? ప్రభుత్వం తేదీని ప్రకటించిందా?

PM Kisan 23rd Installment: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 23వ విడతపై చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు తమ ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2,000 జమ కావడం కోసం ఎదురుచూస్తున్నారు. 22వ విడత నుంచి ఈ నిరీక్షణ కొనసాగుతోంది. ప్రధాని మోదీ 2026 మార్చి 13న 22వ విడతను విడుదల చేశారు. అప్పటి నుంచి దేశ రైతులు 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, రైతుల నిరీక్షణ త్వరలోనే ముగియవచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. వచ్చే వారం 23వ విడత వస్తుందా లేదా అని చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..!

23వ భాగం కోసం ఎదురుచూపులు నిజంగా ముగుస్తాయా?

సాధారణంగా పీఎం కిసాన్‌ విడత జూన్‌లో విడుదల చేస్తుంటుంది కేంద్రం. ఈ 23వ విడత కోసం తమ నిరీక్షణ వచ్చే వారంతో ముగుస్తుందా అని రైతులు భావిస్తున్నారు. 23వ విడత విడుదల కోసం ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక తేదీని ప్రకటించలేదు. అయితే గత విడతల విడుదల సరళి ఆధారంగా పీఎం కిసాన్ 23వ విడత 2026 జూన్-జూలై మధ్యలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ, అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గాల్లో MMTS రైళ్లు పాక్షికంగా రద్దు.. కారణం ఏంటంటే..!

ఎలా తనిఖీ చేయాలి?

రైతులు తమ పీఎం కిసాన్ లబ్ధిదారుల స్టేటస్‌ను తనిఖీ చేసుకోవడానికి ఈ కింది దశలను అనుసరించండి.

  • అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • బెనిఫిషియరీ స్టేటస్ పేజీకి వెళ్లండి.
  • “బెనిఫిషియరీ స్టేటస్” పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ నంబర్ లేదా ఖాతా నంబర్‌ను నమోదు చేయండి.
  • “గెట్ డేటా” పై క్లిక్ చేయండి.
  • బెనిఫిషియరీ స్టేటస్‌ను తనిఖీ చేయండి.
  • పేమెంట్ స్టేటస్‌ను తనిఖీ చేయండి. సిస్టమ్ ప్రాసెస్ చేసిన తర్వాత మీ బెనిఫిషియరీ స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: Cheque Bounce: చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? చట్టం ఏం చెబుతోంది?

ఇది కూడా చదవండి: Electric Car: కేవలం 3 నిమిషాల్లోనే ఫుల్‌ ఛార్జింగ్‌.. 250 కి.మీ రేంజ్‌.. అద్భుతమైన ఎలక్ట్రిక్ కారు..!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి