Reading Time: < 1 minute
Srh Sign Gerald Coetzee As Replacement For Injured David Payne In Ipl 2026

ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు ఉప్పల్‌ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ నుంచి కీలక అప్‌డేట్‌ వచ్చింది. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ గెరాల్డ్ కోయిట్జీని జట్టులోకి తీసుకున్నట్లు ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ తెలిపింది. గాయం కారణంగా టోర్నీకి దూరమైన డేవిడ్ పైన్ స్థానంలో గెరాల్డ్‌కు ఎస్‌ఆర్‌హెచ్ అవకాశం ఇచ్చింది. మిగిలిన సీజన్ కోసం కోయెట్జీ ఎస్‌ఆర్‌హెచ్ తరఫున ఆడనున్నాడు.

డేవిడ్ పేన్‌ కాలివేళ్ల వద్ద గాయం కావడంతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో గెరాల్డ్ కోయిట్జీని రూ. 2 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో మంచి అనుభవం ఉన్న కోయిట్జీ.. ఎస్‌ఆర్‌హెచ్ బౌలింగ్ దళానికి బలం చేకూర్చనున్నాడు. కోయెట్జీ ఇప్పటివరకు దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 14 వన్డేలు, 18 టీ20 మ్యాచ్‌లు ఆడి.. మొత్తం 67 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 14 మ్యాచ్‌లు ఆడి 15 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. 2024లో ముంబై తరఫున 10 మ్యాచ్‌లు, 2025లో గుజరాత్ తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడాడు.

Also Read: SRH vs CSK: నేడు ఉప్పల్ మైదానంలో ఆసక్తికర పోరు.. ధోనీ దిగుతాడా?, మ్యాచ్ సజావుగా సాగేనా?

డేవిడ్ పేన్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్ తరఫున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. డెబ్యూ మ్యాచ్‌లో బెంగళూరుపై 3 ఓవర్లలో 2/35 గణాంకాలతో మంచి ప్రదర్శన ఇచ్చాడు. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ రజత్ పటిదార్, వికెట్ కీపర్ జితేష్ శర్మ వికెట్లు తీసుకున్నాడు. అయితే తదుపరి మ్యాచ్‌లో కోల్‌కతాపై ఒక్క వికెట్ కూడా తీయలేదు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్ ఐదు మ్యాచ్‌లు ఆడి.. రెండు విజయాలు, మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. టీమ్ నెట్ రన్ రేట్ +0.576గా ఉంది.