Reading Time: 2 minutes
ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలను భానుడు భయపెడుతున్నాడు. ఏప్రిల్ నెలలోనే సూర్యుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటితే చాలు.. అడుగు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు 43 నుండి 45 డిగ్రీలకు చేరువవుతున్నాయి. వాతావరణ శాఖా అధికారులు డేంజర్ వార్నింగ్స్ జారీ చేశారు. అసలు ఏయే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎండల తీవ్రత ఎప్పుడు తగ్గుతుంది? వాతావరణ శాఖా అధికారి శ్రీనివాస్ గారు ఏం చెప్పారు? పూర్తి వివరాలు ఒకసారి చూసేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం నాటి గణాంకాలను పరిశీలిస్తే, రాష్ట్రంలోనే అత్యధికంగా అదిలాబాద్ జిల్లాలో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేవలం అదిలాబాద్ మాత్రమే కాదు, ఉత్తర తెలంగాణ మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. నిజామాబాద్‌ జిల్లాలో 42.7 డిగ్రీలు, మహబూబ్ నగర్ & రామగుండంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్ లోనూ గరిష్టంగా 41 నుండి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. మెదక్ 41.2 డిగ్రీలు నమోదు కాగా, ఖమ్మం & నల్గొండ జిల్లాలో 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. సిటీ విస్తరిస్తున్న కొద్దీ కాంక్రీట్ జంగిల్‌లో వేడి గాలులు విపరీతంగా పెరిగిపోయాయి. హకీంపేట్, దుండిగల్, రాజేంద్రనగర్ వంటి శివారు ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వాతావరణ శాఖా అధికారి శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు. టీవీ9తో మాట్లాడిన వాతావరణ శాఖా అధికారి శ్రీనివాస్ కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే రెండు రోజుల పాటు ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. మరో 1 నుండి 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగవచ్చని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్ మరియు నారాయణపేట ఈ హెచ్చరికలు వర్తిస్తాయని తెలిపారు. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వడగాల్పుల ముప్పు ఉందని వార్నింగ్ కూడా ఇచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యురేనియం అప్పగింతకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్

ఇంటర్‌ ఫలితాల్లో అదరగొట్టిన ట్విన్స్‌.. ప్రతి సబ్జెక్ట్‌లో సేమ్ మార్కులు

పూజారి ఇంట్లో అద్భుతం.. సీతారాముల చెంత నాగేంద్రుడు ప్రత్యక్షం

జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల అమెరికా యుద్ధవిమానాలను కూల్చేస్తున్న ఇరాన్

విద్యుత్‌ స్తంభం ఎక్కి యువకుడు హల్చల్‌.. కారణం ఇదే