Reading Time: < 1 minute
ఒక్కరోజు వయసున్న క్యూట్ ‘రైనో’.. నెట్టింట హల్చల్ చేస్తున్న వీడియో

వన్యప్రాణుల ప్రపంచం ఎప్పుడూ వింతగానే ఉంటుంది. అడవిలో అప్పుడే పుట్టిన జంతువులను చూడటం ఒక అరుదైన అనుభూతి. తాజాగా సోషల్ మీడియాలో ఒక బుల్లి ఖడ్గమృగం వీడియో తెగ వైరల్ అవుతోంది. కేవలం ఒక్కరోజు వయసున్న ఈ ‘బేబీ రైనో’ అల్లరిని చూసి వన్యప్రాణి ప్రేమికులు ఫిదా అవుతున్నారు. ప్రముఖ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ అద్భుతమైన వీడియోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ఒక్కరోజు వయసున్న బుల్లి ఖడ్గమృగాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అంటూ ఆయన పోస్ట్ చేసిన ఈ క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. జాతీయ పార్కులోని ఖడ్గమృగాల సంరక్షణలో భాగంగా ప్రతి జీవిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఈ క్రమంలోనే అటవీ శాఖ సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండగా ఈ చిన్నారి రైనో వారి కంటపడింది. ఖడ్గమృగం పిల్లల దగ్గరకు వెళ్లడం అత్యంత ప్రమాదకరమని పర్వీన్ కస్వాన్ హెచ్చరించారు. తల్లి రైనో తన బిడ్డను రక్షించుకోవడానికి ఎంతటి దాడికైనా వెనుకాడదు. అందుకే, వన్యప్రాణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శిక్షణ పొందిన ఏనుగుపై కూర్చుని, చాలా దూరం నుండి జూమ్ లెన్స్ ద్వారా ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు ఆయన వివరించారు. నెట్టింట ప్రత్యక్షమైన ఈ క్యూట్‌ వీడియోను కొద్దిగంటల్లోనే లక్షలాదిమంది వీక్షించారు. అడవిలోకి కొత్త అతిథి వచ్చింది.. చాలా ముద్దుగా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ బుల్లి రైనోను చూసి తెగ సంబరపడిపోతున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇవి పనసకాయలా.. మామిడికాయలా.. విరగకాసిందిగా

పెట్రోల్‌ బంకుల్లో ఎయిర్‌ కూలర్లు.. అమ్మడానికి కాదండోయ్‌

పాక్‌లో ఉగ్రవాదుల హత్యలు.. మోటార్‌సైకిళ్లపై వచ్చి కాల్పులు

Monalisa Bhosale: రక్షణ కోరుతూ కేరళం సీఎంకు మోనాలిసా లేఖ

ఆకాశం నుంచి నిప్పుల వర్షం.. మూడు రోజుల్లో మురిపించనున్న వర్షాలు