Reading Time: < 1 minute
Mahesh Babu Rajamouli Varanasi Movie Song Shoot Bosco Martis Updates

గ్లోబల్ స్థాయిలో అంచనాలు ఉన్న రాజమౌళి-మహేశ్‌ బాబు ప్రాజెక్ట్ ‘వారణాసి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. విభిన్న యుగాల నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామాలో మహేశ్‌ బాబు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒకటి శ్రీరాముడి పాత్ర కాగా, మరొకటి ‘రుద్ర’ అనే పవర్‌ఫుల్ పాత్ర. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి దిగ్గజ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, విజయేంద్ర ప్రసాద్ కథ ఈ సినిమాకు వెన్నెముకగా నిలవనున్నాయి. తాజా సమాచారం ప్రకారం,

Also Read : Suriya: సూర్య – జ్ఞానవేల్ మ్యాజిక్ రిపీట్.. మరో రియలిస్టిక్ డ్రామాకు రంగం సిద్ధం!

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఒక ప్రత్యేక సెట్‌లో ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ (Bosco Martis) నృత్యరీతులు అందిస్తుండటం విశేషం. ఈ పాట చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిత్ర బృందం మే నెల మొత్తం విరామం తీసుకోనుంది. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ఈ బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మళ్ళీ జూన్ నెలలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.