
Google Gemini AI: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ (MBBS), ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ‘నీట్ యూజీ’ (NEET UG 2026) పరీక్షకు సిద్ధమవ్వడం ఇప్పుడు మరింత సులభం కానుంది. ప్రతి సంవత్సరం సుమారు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నప్పటికీ, కేవలం కొద్దిమందికి మాత్రమే సీట్లు లభిస్తున్నాయి. ఈ పోటీని తట్టుకోవడానికి విద్యార్థులు లక్షల రూపాయలు వెచ్చించి కోచింగ్ సెంటర్లపై ఆధారపడుతున్నారు. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు అండగా నిలిచేందుకు గూగుల్ ఇండియా సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఖరీదైన కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఇబ్బంది పడే విద్యార్థుల కోసం తన ఏఐ ప్లాట్‌ఫామ్ ‘జెమిని’ (Gemini) ద్వారా ఉచిత శిక్షణను అందుబాటులోకి తెచ్చింది.
READ ALSO: Vivo Y600 Pro: వివో వై600 ప్రో.. 10,000mAh బ్యాటరీ, స్టైలిష్ డిజైన్ తో వచ్చేస్తోంది
జెమిని యాప్‌తో ఉచిత శిక్షణ
గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యాప్ అయిన ‘జెమిని’ ద్వారా నీట్ ప్రాక్టీస్ టెస్టులను ఉచితంగా అందిస్తోంది. దీని కోసం విద్యార్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం జెమిని యాప్‌ను ఓపెన్ చేసి, “నేను నీట్ మాక్ టెస్ట్ రాయాలనుకుంటున్నాను” (I want to take a NEET mock test) అని అడిగితే చాలు, ఏఐ వెంటనే మీకు పరీక్షను సిద్ధం చేస్తుంది.
ప్రత్యేకతలు ఇవే:
నీట్ సిలబస్‌కు అనుగుణంగా పూర్తి సిలబస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. జెమిని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా, సందేహాలను యాప్‌లో అక్కడికక్కడే నివృత్తి చేసుకోవచ్చు. అసలైన నీట్ పరీక్ష రాస్తున్న అనుభూతిని కలిగించేలా ఈ మాక్ టెస్టులను గూగుల్ డిజైన్ చేసింది. గూగుల్.. ఎక్స్ వేదికగా దీనికి సంబంధించిన డెమో వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇది ఎంతో సులభంగా, విద్యార్థులకు అర్థమయ్యేలా జెమినీ విద్యార్థులకు పరీక్ష నిర్వహించనుంది. విద్యార్థుల అభ్యసన ప్రక్రియను మరింత సింపుల్ చేయడమే లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు గూగుల్ పేర్కొంది. విద్యారంగంలో ఏఐ (AI) టెక్నాలజీని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా నాణ్యమైన విద్యను అందరికీ చేరువ చేయవచ్చని గూగుల్ ఆశాభావం వ్యక్తం చేసింది. మొత్తానికి నీట్ యూజీ 2026 లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు గూగుల్ జెమిని ఒక పర్సనల్ ట్యూటర్‌లా మారి, వారి డాక్టర్ కలను నిజం చేసే దిశగా అండగా నిలవనుంది.
Full length, no cost NEET UG practice tests are now in @GeminiApp, isn’t that neat?
Say “I want to take a NEET mock test” and begin
Read here: https://t.co/eN2WRUZ2PH pic.twitter.com/YnyUe1Rftv
— Google India (@GoogleIndia) April 14, 2026

