Reading Time: 2 minutes
Gautam Adani Becomes Asias Richest Person Bloomberg Billionaires Index 2026

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంపద ఇటీవల భారీగా పెరిగి, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీని అధిగమించి భారత్, ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, గురువారం గౌతమ్ అదానీ సంపద 3.56 బిలియన్ డాలర్లు పెరిగి 92.6 బిలియన్ డాలర్లకు చేరింది. ముఖేష్ అంబానీ నికర సంపద 90.8 బిలియన్ డాలర్లతో అదానీ కంటే వెనుకబడింది. దీంతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో అదానీ 19వ స్థానానికి ఎగబాకగా, ముఖేష్ అంబానీ 20వ స్థానానికి పడిపోయారు.

Also Read:YS Jagan Foreign Tour: వైఎస్‌ జగన్‌ విదేశీ పర్యటనకు గ్రీన్‌ సిగ్నల్.. సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

టాప్ 5లో ఎవరున్నారు?

656 బిలియన్ డాలర్ల నికర సంపదతో ఎలాన్ మస్క్ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ 286 బిలియన్ డాలర్ల నికర సంపదతో రెండవ స్థానంలో ఉన్నారు. అమెజాన్ అధినేతలు జెఫ్ బెజోస్ (269 బిలియన్ డాలర్లు), సెర్గే బ్రిన్ (266 బిలియన్ డాలర్లు), మార్క్ జుకర్‌బర్గ్ (239 బిలియన్ డాలర్లు) కూడా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు.

ప్రపంచంలోని 20 మంది అత్యంత ధనవంతులు

క్రమ సంఖ్య పేరు నికర విలువ
1 ఎలాన్ మస్క్ 656 బిలియన్ డాలర్లు
2 లారీ పేజ్ 286 బిలియన్ డాలర్లు
3 జెఫ్ బెజోస్ 269 ​​బిలియన్ డాలర్లు
4 సెర్గే బ్రిన్ 266 బిలియన్ డాలర్లు
5 మార్క్ జుకర్‌బర్గ్ 239 బిలియన్ డాలర్లు
6 లారీ ఎల్లిసన్ 230 బిలియన్ డాలర్లు
7 మైఖేల్ డెల్ 170 బిలియన్ డాలర్లు
8 జెన్సన్ హువాంగ్ 164 బిలియన్ డాలర్లు
9 బెర్నార్డ్ ఆర్నో 164 బిలియన్ డాలర్లు
10 జిమ్ వాల్టన్ 150 బిలియన్ డాలర్లు
11 స్టీవ్ బాల్మర్ 148 బిలియన్ డాలర్లు
12 రాబ్ వాల్టన్ 147 బిలియన్ డాలర్లు
13 ఆలిస్ వాల్టన్ 146 బిలియన్ డాలర్లు
14 వారెన్ బఫెట్ 142 బిలియన్ డాలర్లు
15 కార్లోస్ స్లిమ్ 130 బిలియన్ డాలర్లు
16 అమాన్సియో ఒర్టెగా 130 బిలియన్ డాలర్లు
17 బిల్ గేట్స్ 104 బిలియన్ డాలర్లు
18 థామస్ పీటర్ఫీ 93.8 బిలియన్ డాలర్లు
19 గౌతమ్ అదానీ $92.6 బిలియన్లు
20 ముఖేష్ అంబానీ 90.8 బిలియన్ డాలర్లు