Reading Time: < 1 minute

ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు  :  కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

Caption of Image.

జనగామ, వెలుగు : అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని జనగామ కలెక్టర్​ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ తరలింపుపై ఆయన రివ్యూ నిర్వహించారు. రూల్స్ ప్రకారమే అనుమతులు ఇవ్వాలని సూచించారు. ఇండ్ల నిర్మాణాలకు తరలించే ఇసుకకు కూడా ఈ రూల్స్​వర్తిస్తాయని చెప్పారు.

అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. మీటింగ్​లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, డీపీవో వెంకట్ రెడ్డి, ఏడీ మైన్స్ విజయ్ కుమార్, ఆర్టీవో శ్రీనివాస్ గౌడ్, నీటి పారుదల శాఖ అధికారి ప్రవీణ్ ఉన్నారు.

 

©️ VIL Media Pvt Ltd.