
హసన్ పర్తి, వెలుగు: విద్యార్థులు భౌతిక శాస్త్రంపై అవగాహన పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు అన్నారు. హసన్ పర్తి మండలం దేవన్నపేట ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు భౌతికశాస్త్రం పట్టికలపై అవగాహన కల్పించారు.
ముందుగా స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఫిజిక్స్ పై అవగాహన పెంచుకుంటే విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డా.జ్యోత్స్న, ఫిజికల్ డైరెక్టర్ నాదనబోయిన వెంకటేశ్వర్లు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.