Reading Time: < 1 minute
Mrunal Thakur Comments On Rrr And Representing Telugu Cinema Globally

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు కేవలం నటిగానే కాకుండా, ఇండియన్ సినిమా రిప్రజెంటేటివ్‌గా తన గళాన్ని వినిపిస్తోంది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమపై తనకున్న గౌరవాన్ని, గ్లోబల్ స్థాయిలో దానికున్న క్రేజ్‌ను పంచుకున్నారు. ఈ సందర్భంగా మృణాల్ తన సోదరుడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది.

Also Read : Papam Prathap: IPL కంటే మా సినిమానే బాగుంటుంది.. ‘పాపం ప్రతాప్’ హీరో తిరువీర్ కాన్ఫిడెంట్ స్టేట్‌మెంట్!

‘మా తమ్ముడు ఒక ఫిలిం స్టూడెంట్. తన కాలేజీలో ప్రొఫెసర్లు రాజమౌళి తీసిన ‘RRR’ సినిమా గురించి ప్రత్యేకంగా క్లాసులు చెబుతున్నారట. ఒక తెలుగు సినిమాను విదేశీ యూనివర్సిటీల్లో పాఠాలుగా బోధించడం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. నేను గ్లోబల్ వేదికలపై నిలబడ్డప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు, భారతీయ చిత్ర పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటున్నాను. మన కథలు, మన సాంకేతికత ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరుకున్నాయి’ అని మృణాల్ తన మనసులోని మాటను బయటపెట్టింది. ‘సీతా రామం’, ‘హాయ్ నాన్న’ వంటి సినిమాలతో తెలుగులో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్న ఈమె, ప్రస్తుతం అడివి శేష్‌తో కలిసి ‘డకోయిట్’ (Dacoit) అనే యాక్షన్ డ్రామాతో మరో హిట్ అందుకుంది.