Reading Time: < 1 minute

50 శాతం సీట్లు పెంచితే సౌత్ స్టేట్స్‌‌‌‌కు నష్టం : జైరాం రమేశ్‌‌‌‌

Caption of Image.
  •     నార్త్ ఈస్ట్, చిన్న రాష్ట్రాలకూ అన్యాయమే: జైరాం రమేశ్‌‌‌‌

న్యూఢిల్లీ: లోక్‌‌‌‌సభలో సీట్లు 50 శాతం పెరుగుతాయని ఎంపీలకు పంపిన ముసాయిదాల్లో కేంద్రం పేర్కొన్నదని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ (కమ్యూనికేషన్స్) జైరాం రమేశ్ తెలిపారు.  ఈ విధానంతో దక్షిణదితోపాటు నార్త్ ఈస్ట్, ఇతర చిన్న రాష్ట్రాలు నష్టపోతాయని పేర్కొన్నారు. ఇవి ఉద్దేశపూర్వకంగా కేంద్రం తెచ్చిన బిల్లులని, రాజకీయ లబ్ధికోసమే పార్లమెంట్ సమావేశాలు పెట్టారని మండిపడ్డారు. 

డీలిమిటేషన్ కమిషన్ అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుందని, అస్సాం, జమ్మూ –కాశ్మీర్ లో ఎన్డీయే సర్కారు అనుసరించిన విధానాలు అందరికీ తెలుసునని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.