Reading Time: < 1 minute
Ustaad Bhagat Singh Now Streaming On Netflix

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్‘. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ ఏడాది మార్చి 19న భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో అడుగుపెట్టిన ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ కావండతో సినిమాపై ఫ్యాన్స్ ఎన్నో అసలు పెట్టుకున్నారు. కానీ వారిని బాగా నిరాశపరిచింది ఉస్తాద్. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు కొంత ఆకర్షణగా నిలిచాయి. కానీ అవేవి సినిమాని నిలబెట్టలేక పోయాయి. యాంటీ ఫాన్స్ నుండి భారీగా ట్రోలింగ్ గురైంది ఉస్తాద్. 

Also Read : Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం

కాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం నేటి నుండి స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలై నెల రోజులు కాకుండానే ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను పలకరించడం విశేషం. కేవలం తెలుగులోనే కాకుండా  దక్షిణాది భాషలైన తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. థియేటర్లో మిస్ అయిన వారు ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఉస్తాద్’ గర్జనను ఆస్వాదించవచ్చు.  మరి థియేటర్ లో ప్లాప్ అయిన ఉస్తాద్ ఓటీటీలో ఏ మేరకు ఆకట్టుకుంటాడో ఎలాంటి వ్యూస్ రాబడతాడో చూడాలి. మరోవైపు యాంటీ ఫ్యాన్స్ నుండి మరోసారి ట్రోలింగ్ కూడా తప్పెలా లేదు.