
IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరుగుతున్న హైవోల్టేజ్ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పరుగుల కోసం తెగ కష్టపడుతుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కి దిగిన లక్నోకి ఆశించిన శుభారంభం లభించలేదు. ఆర్సీబీ బౌలర్లు అద్భుతమైన బంతులతో లక్నో బ్యాటర్లని భయపెట్టారు. లక్నో 34 పరుగుల దగ్గర ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (12) రాసిఖ్ సలామ్ దార్ బౌలింగ్ లో దేవ్‌దత్ పడిక్కల్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో గాయపడ్డాడు.
దీంతో ఇన్నింగ్స్ ఐదో ఓవర్ సమయంలో జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు రిషబ్ పంత్ (0) ప్రయత్నించాడు. అయితే బంతి స్పీడ్ గా వచ్చి నేరుగా పంత్ ఎడమ మోచేతికి బలంగా తగిలింది. ఆ సమయంలో పంత్ తీవ్రమైన అసౌకర్యానికి గురికాట్టగా, ఆ తర్వాత బంతికే పంత్ బంతిని వికెట్ల మీదకు కొట్టుకోబోయి తృటిలో తప్పించుకున్నాడు. అప్పటికే అతడు తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు కనిపించింది. పంత్ ఇబ్బందిని గమనించిన అంపైర్లు కాసేపు ఆటని ఆపేశారు. వెంటనే లక్నో ఫిజియో మైదానంలోకి వచ్చి పంత్ ఎడమ చేతికి చికిత్స చేసిన నొప్పి తగ్గడానికి మ్యాజిక్ స్ప్రే ఉపయోగించినప్పటికీ, నొప్పి తగ్గకపోవడంతో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రిటైర్డ్ హర్ట్‌గా పంత్ వెనుదిరిగాడు.
ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన నికోలస్ పూరన్ పరుగులు చేసేందుక తెగ కష్టపడ్డాడు. ముఖ్యంగా హాజిల్‌వుడ్ బౌలింగ్ లో రన్స్ చేయడం గగనం అయిపోయింది. 3 ఓవర్లు వేసిన హాజిల్‌వుడ్ పూరన్ (1)ని ఔట్ చేసి కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. మరోవైపు, మిచెల్ మార్ష్ మాత్రం జోరుగా బ్యాటింగ్ చేస్తూ, హాఫ్ సెంచరీ దిశగా ప్రయనిస్తున్న సమయంలో.. కృనాల్ పాండ్యా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 71 పరుగులకే కీలకమైన 3 వికెట్లని లక్నో సూపర్ జెయింట్స్ కోల్పోయింది. ఇక 11 ఓవర్లు ముగిసే సమయానికి లక్నో 82/3గా ఉంది.
TIMBER x 2️⃣!
Josh Hazlewood 🤜🤛 Krunal Pandya@RCBTweets on 🔝
Updates ▶️ https://t.co/UztAZM9l0q#TATAIPL | #KhelBindaas | #RCBvLSG pic.twitter.com/464Gt5q8Na
— IndianPremierLeague (@IPL) April 15, 2026