
సూపర్ స్టార్ మహేశ్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా అరంగ్రేటం చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు . ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
కథా నేపథ్యం
తిరుపతి సమీపంలోని ‘శ్రీనివాస మంగాపురం’ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మధ్యతరగతి యువకుడు వాసు (జయకృష్ణ), అత్యంత ధనిక కుటుంబానికి చెందిన మంగ (రషా థడాని) మధ్య చిగురించిన ప్రేమ ఈ చిత్రానికి ప్రాణం. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కుమార్తె రషా థడాని ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ , కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. సాఫీగా సాగిపోతున్న వీరి ప్రేమకథలోకి హీరోయిన్ ఫ్యామిలీ ప్రవేశించడంతో కథ మలుపు తిరుగుతుంది. మర్యాదకు, అహంకారానికి మధ్య జరిగే పోరాటంలో వాసు ఎలా నిలబడ్డాడు అనేది ఈ మూవీలో కీలకంగా మారుతుంది.
పవర్ ఫుల్ పాత్రలో మోహన్ బాబు
ఒక పక్క స్వచ్ఛమైన ప్రేమకథగా కనిపిస్తూనే, మరోపక్క గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ చివరలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పవర్‌ఫుల్ విలన్‌గా మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన గంభీరమైన లుక్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అజయ్ భూపతి మార్క్ రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్ టీజర్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. పి. కిరణ్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ తన నేపథ్య సంగీతంతో ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేశారు. జయకృష్ణ తన మొదటి సినిమాతోనే మాస్, క్లాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా కనిపిస్తున్నాడు. మరి ఈ ‘శ్రీనివాస మంగాపురం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి..