
భారత సైన్యంలోని టెరిటోరియల్ ఆర్మీ డైరెక్టరేట్, టెరిటోరియల్ ఆర్మీ కమిషన్ టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్ (లెఫ్టినెంట్ హోదాలో నియమిస్తారు) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ఏప్రిల్ 20న ప్రారంభమై మే19-న ముగుస్తుంది.
ALSO READ : హైదరాబాద్ MANUUలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు
పోస్ట్ పేరు: టెరిటోరియల్ ఆర్మీ ఆఫీసర్.
మొత్తం ఖాళీలు: 12 (పురుషులు 11, మహిళలు 1).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 42 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ALSO READ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
అప్లికేషన్: ఆన్‌లైన్ ద్వారా.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 20.
లాస్ట్ డేట్: మే 19.
అప్లికేషన్ ఫీజు: అందరు అభ్యర్థులు రూ.500 చెల్లించాలి.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తేదీ: 2026, జులై 12.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ indianarmy.nic.in ను సందర్శించండి.
ఎగ్జామ్ ప్యాటర్న్
ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ). ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. రీజనింగ్ నుంచి 40 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్ నుంచి 30 ప్రశ్నలు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. నెగటివ్ మార్కింగ్ ఉన్నది. ప్రతి తప్పుడు సమాధానానికి 1/3వ వంతు (0.33 శాతం) మార్కులు కోత విధిస్తారు.