Reading Time: < 1 minute

నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా.. తమిళనాడులో నల్లజెండాల నిరసనకు స్టాలిన్ పిలుపు

Caption of Image.

నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా తమిళనాడులో ప్రతి ఇంటిపై నల్లజెండాల ఎగురవేసి నిరసనలు తెలపాలని సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్న సందర్భంగా డీఎంకే పార్టీ ఎంపీలతో అత్యవసర సమావేశం అయ్యారు స్టాలిన్. నియోజకవర్గాల పునర్విభజన బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు  భారీ చారిత్రక అన్యాయం జరుగుతుందన్నారు.

నియోజకవర్గాల పునర్విభజనతో  తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకు ఆయా రాష్ట్రాల ఎంపీలను సంప్రదిస్తున్నానని స్టాలిన్ చెప్పారు. 

దేశ అభివృద్ధిలో కీలకమైన అయినందుకు తమిళనాడు,దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష విధిస్తున్నారా.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లుతో తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు చారిత్రక మహా అన్యాయం అని Xలో పోస్ట్ చేశారు స్టాలిన్. 

దక్షిణాదిలో ఎందుకు ఆందోళన..

లోక్‌సభలో 33% మహిళా కోటా, నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లను 850 వరకు పెంచాలన్న ప్రభుత్వ ప్రతిపాదిత బిల్లులతో లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాలు తమ బలాన్ని కోల్పోతాయనే ఆందోళనలు లేవనెత్తాయి.  నియోజకవర్గాల పునర్విభజనను తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  

డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు సీఎంస్టాలిన్ ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితోపాటు  దక్షిణ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి లేఖ రాశారు. ప్రతిపాదిత అదనపు సీట్లలో 50 శాతాన్ని దామాషా పద్ధతిలో కేటాయించే ‘హైబ్రిడ్ నమూనా’ను ప్రతిపాదించారు.

©️ VIL Media Pvt Ltd.