Reading Time: < 1 minute

RCB vs LSG మధ్య కీలక పోరు.. హెడ్ -టు -హెడ్ రికార్డులు, పిచ్ రిపోర్ట్ ఇదే!

Caption of Image.

ఐపీఎల్ 2026లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరగనున్న కీలక పోరులో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడబోతుంది. ముంబై ఇండియన్స్‌పై గెలిచి తిరిగి ఫామ్‌లోకి వచ్చిన ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో గెలుపు పరంపర కొనసాగించాలని చూస్తోంది. గత మ్యాచ్‌లో ఫిల్ సాల్ట్ విధ్వంసం సృష్టించడంతో ఆర్‌సీబీ బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు లక్నో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, రెండు ఓటములతో సమతూకంగా ఉంది.

హెడ్ -టు -హెడ్ రికార్డులు: 
ఇప్పటి వరకు ఈ రెండు జట్లు మొత్తం 6 సార్లు పోటీ పడ్డాయి.  అందులో ఆర్‌సీబీ నాలుగు మ్యాచులలో గెలవగా, లక్నో సూపర్ జెయింట్స్ 2 మ్యాచులలో విజయం సాధించడంతో .. ఈ ఇరు జట్ల పోరులో బెంగళూరుదే పైచేయి సాధించింది.  

పిచ్ రిపోర్ట్: 
చిన్నస్వామి స్టేడియం బ్యాటర్లకు స్వర్గధామం అని మరోసారి నిరూపితమవుతోంది. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ టీమ్స్ 200 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. గత మ్యాచ్‌లో ఆర్‌సీబీ చెన్నైపై ఏకంగా 250 పరుగులు చేయగా, ఇవాళ్టి మ్యాచ్‌లో కూడా పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.

తుది జట్ల అంచనా: 
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్, జోష్ హాజిల్‌వుడ్.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ

లక్నో సూపర్ జయంట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే/అన్రిచ్ నోర్ట్జే, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ.
ఇంపాక్ట్ ప్లేయర్: ప్రిన్స్ యాదవ్

©️ VIL Media Pvt Ltd.