Reading Time: < 1 minute

సికింద్రాబాద్‌లో చిన్నారులకు ఉచితంగా..హెల్మెట్లు పంపిణీ చేసిన ట్రాఫిక్ పోలీసులు

Caption of Image.

సికింద్రాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బైకులపై వెళ్లే చిన్నారులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. బైకు వెనకాల కూర్చునే చిన్నారులతో సహా ప్రతి ఒక్కరూ  సూచించారు. రోడ్డు ప్రమాదంలో అత్యధికంగా హెల్మెట్ ధరించని కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని.. బైకుపై పిల్లలను తీసుకెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పేరెంట్స్ రోడ్ సేఫ్టీ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. 

టూవీలర్స్ పై ప్రయాణించే చిన్నారులతో పాటు వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్ ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాములు అన్నారు.  రోడ్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ లోని ఆలుగడ్డ బాయి సర్కిల్ దగ్గర టూ వీలర్ పై ప్రయాణించే పిల్లలకు హెల్మెట్ అందజేశారు. 

నాలుగేళ్లు నిండిన ప్రతి చిన్నారి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని పేరెంట్స్ కు ట్రాఫిక్ పోలీసులు సూచించారు.  బైక్ నడిపే వారే కాకుండా, వెనకాల కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు.  కేవలం ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే కాకుండా, తమ పిల్లల భద్రత కోసం తల్లిదండ్రులు బాధ్యతగా తమ పిల్లలకు హెల్మెట్ ధరింపజేయాలన్నారు. 

హెల్మెట్ లేకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో వెనుక కూర్చున్న వారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు ట్రాఫిక్ పోలీసులు. 

©️ VIL Media Pvt Ltd.