
IPL 2026 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ లక్నో సూపర్ జయంట్స్ జట్లు కాసేపట్లో (2026, ఏప్రిల్ 15న) పోటీ పడబోతున్నాయి. గత మ్యాచ్‌లో ముంబైపై సాధించిన విజయంతో ఆర్‌సీబీ పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉండగా, లక్నో గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓటమిని ఎదుర్కొని ఈ మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. కాగా ఈరోజు జరిగే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అత్యధిక పరుగులు చేసే అవకాశం కనిపిస్తుంది. తన సొంత గడ్డ (చిన్నస్వామి స్టేడియం)పై ఈ సీజన్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కోహ్లీ ఇప్పటికే 97 పరుగులు సాధించి మంచి ఫామ్‌లో ఉన్నాడు.
విజేత ఎవరంటే?:
ప్రస్తుత ఫామ్, హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్‌ను బట్టి చూస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ఈ మ్యాచ్‌లో హాట్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. గూగుల్ స్పోర్ట్స్ డేటా ప్రకారం.. ఆర్‌సీబీ గెలిచే అవకాశం 62.3 శాతం ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ గెలిచే అవకాశం 37.7 శాతం మాత్రమే ఉందని తెలిపింది.
పిచ్ రిపోర్ట్:
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఎప్పుడూ బ్యాటర్లకు స్వర్గధామంగా ఉంటుంది. చిన్న బౌండరీలు, ఫ్లాట్ వికెట్ వల్ల ఇక్కడ పరుగుల వరద పారడం ఖాయం. ఆర్‌సీబీ గతంలో ఇక్కడ 250+ పరుగులు కూడా సాధించింది, కాబట్టి ఈరోజు కూడా భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రసిక్ సలామ్, జోష్ హాజిల్‌వుడ్.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాష్ శర్మ
లక్నో సూపర్ జయంట్స్: ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్, ఆయుష్ బదోని, నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, జార్జ్ లిండే/అన్రిచ్ నోర్ట్జే, మహమ్మద్ షమీ, అవేష్ ఖాన్, దిగ్వేష్ సింగ్ రాఠీ.
ఇంపాక్ట్ ప్లేయర్: ప్రిన్స్ యాదవ్