
సూపర్ స్టార్ రజినీకాంత్ తన 75 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం జైలర్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత భారీ ప్రాజెక్ట్ ‘తలైవర్ 173’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ నిర్మిస్తోంది. ఈ సినిమా దక్షిణాది సినీ చరిత్రలో అరుదైన మైలురాయిగా నిలవనుంది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కమల్–రజనీకాంత్ కలిసి చేస్తుండటంతో ప్రత్యేకతను సంతరించుకుంది. అయితే, ఈ భారీ ప్రాజెక్ట్ మాత్రం, ప్రస్తుతం అనూహ్య మార్పులతో తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..
‘తలైవర్ 173’-రెండోసారి డైరెక్టర్ మార్పు!
మొదట ఈ చిత్రానికి దర్శకుడిగా సుందర్.సి ను ప్రకటించారు. అయితే అనూహ్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ముఖ్యంగా సినిమా అనౌన్స్ చేసిన వారం రోజుల లోపే తప్పుకోవడం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. అనంతరం తమిళ క్రేజీ డైరెక్టర్ సీబీ చక్రవర్తిను అధికారికంగా ప్రకటించారు. సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.. ఏప్రిల్ చివర్లో షూటింగ్ స్టార్ట్ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి.
ఈ క్రమంలోనే డైరెక్టర్ సిబి చక్రవర్తి కూడా తప్పుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ రూమార్డ్ వార్త తెలిసినప్పటి నుంచి తలైవా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దర్శకుడ్ని మార్చడం ఇది రెండోసారి. అసలేం జరుగుతుందని తలైవా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : ధనుష్ సరసన ‘ధురంధర్’ బ్యూటీ..
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డైరెక్టర్ సిబి చక్రవర్తి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలుస్తోంది. ఇతర ప్రాజెక్ట్‌ల కారణంగా, షెడ్యూల్ సమస్యల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా మరోసారి అనిశ్చితిలో పడింది.
Celebrations begin#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/abzvPfuEf9
— Kamal Haasan (@ikamalhaasan) January 3, 2026
ఇప్పుడు ఆయన స్థానంలో మరో క్రేజీ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు రంగంలోకి దిగినట్లు టాక్. ఇందుకోసం కమల్ హాసన్ టీమ్ చర్చలు జరుపుతున్నారని సమాచారం అయితే ఈ విషయాలపై కమల్ ప్రొడక్షన్ హౌస్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. ‘ఓరి దేవుడా’,‘డ్రాగన్’ వంటి సినిమాలతో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు.
ALSO READ : అమరేంద్ర బాహుబలి మరణం తర్వాత ఏం జరిగింది?
అభిమానుల్లో ఆందోళన..
రజనీకాంత్-కమల్ హాసన్ కలయికపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ తరచూ జరుగుతున్న మార్పులు, ఆలస్యాలు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఇప్పుడు డైరెక్టర్ తప్పుకున్నాడనే అధికారిక సమాచారం లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై అనిశ్చితి కొనసాగుతోంది.