Reading Time: < 1 minute

అమరావతిని ఇలానే పలకాలి.. ఇంగ్లీష్లో ఇలానే రాయాలి: ఏపీ ప్రభుత్వం క్లారిటీ

Caption of Image.

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి పేరును ఆంగ్లంలో Amaravati అని మాత్రమే రాయాలని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంగ్లీష్లో అమరావతిని..  “Amaravati”, “Amaravathi”, “Amaraavathi”.. ఇలా ఎవరికి తోచినట్టు వారు రాస్తున్నారు. ఇలా ఒకే పేరును ఇలా రాయడం వల్ల మున్ముందు ప్రభుత్వ డాక్యుమెంట్లలో, రికార్డుల్లో కూడా గందరగోళం ఏర్పడే ప్రమాదముందని.. అందుకే అమరావతి పేరును ఆంగ్లంలో.. “Amaravati” అని మాత్రమే రాయాలని.. ఇలానే పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.

అన్ని అధికారిక లేఖాచారాలు, ప్రభుత్వ ఉత్తర్వులు, నివేదికలు, డిజిటల్ రికార్డులలో “Amaravati” అనే స్పెల్లింగ్‌ను మాత్రమే వినియోగించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. “Amaravati”.. ఇది అమరావతి అనే తెలుగు పదానికి ఏపీ ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక రూపం. ఇది ఒక సరళమైన Transliteration (ఒక భాషని మరొక భాషలోని లిపిలో రాయడం).

ALSO READ : నిజామాబాద్ మార్కెట్ యార్డుపై.. పసుపు రైతుల దాడి

పలికే సందర్భంలో.. ధ్వనిని పూర్తిగా ప్రతిబింబించకపోయినా, లిపి పరంగా ఇది ఏకరీతి, సరళత, వాడుకులో సౌలభ్యంగా ఉంటుంది. పరిపాలన, చట్టపరమైన పత్రాలు, డిజిటల్ డేటాబేస్లు ఇలా అన్నింటిలో ఒక రాష్ట్ర రాజధానికి అయినా, ఒక జిల్లా కేంద్రానికి అయినా ఒకే రూపం అవసరం. ఈ క్రమంలోనే.. ఏపీ ప్రభుత్వం అమరావతి పేరును ఆంగ్లంలో రకరకాలుగా రాసే అవకాశం లేకుండా.. “Amaravati” అని మాత్రమే రాయాలని అధికార యంత్రాంగానికి స్పష్టం చేసింది. ఇకపై.. ఏపీ ప్రభుత్వ జీవోల్లో కూడా అమరావతిని ఇలానే ప్రచురించనున్నారు.

ALSO READ : కదిరిలో ఘోర ప్రమాదం.. నల్ల మందు ఇంట్లో పేలి.. 

©️ VIL Media Pvt Ltd.