
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బిజినెస్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారాలను సమర్పించడానికి చివరి తేదీ మే 05.
పోస్ట్ పేరు: లీగ్ బిజినెస్ అనలిస్ట్.
మొత్తం ఖాళీలు: 8.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్ లేదా ఎం.టెక్/ ఎంఎస్సీ లేదా ఎంసీఏ పూర్తిచేసి ఉండాలి. ఎంబీఏ (సిస్టమ్/ ఫైనాన్స్/ ఆపరేషన్స్/ మార్కెటింగ్) లేదా సమాన అర్హత గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 13.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
లాస్ట్ డేట్: మే 05.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ sbi.bank.in/careers ను సందర్శించండి.