
కేవలం నాలుగు నెలల్లోనే జర్మన్ లాంగ్వేజ్ నేర్పించేలా టామ్ కామ్ కసరత్తు చేస్తోందన్నారు మంత్రి వివేక్. దీని కోసం మందమర్రిలో ప్రత్యేకంగా టామ్ కామ్ మోడల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇటీవలి జర్మనీ పర్యటనలో అనేక అంతర్జాతీయ సంస్థలతో ప్రభుత్వం జరిపిన చర్చలు జరిపామని చెప్పారు మంత్రి వివేక్. యువతకు స్కిల్స్‌తో పాటు, జర్మన్ భాషను నేర్పించేందుకు ప్రభుత్వం టామ్ కామ్ సంస్థకు 90 కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. కేవలం ఉద్యోగాలే కాకుండా, రైతులకు ఉపయోగపడేలా సాయిల్ టెస్టులు, పంట మార్పిడి వంటి అంశాలపై సరికొత్త ఆవిష్కరణలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు.
యువతను ప్రోత్సహించేందుకు జూన్ 2 నుంచి ఏటీసీల్లోశిక్షణ పొందుతున్న వారికి నెలకు 2 వేల రూపాయల చొప్పున స్టైపెండ్ అందించనున్నామని చెప్పారు. జర్మనీ మాత్రమే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో మన యువత సత్తా చాటేలా, వారికి నైపుణ్య శిక్షణ అందిస్తూ ఉపాధి కల్పి్స్తామని చెప్పారు వివేక్.
యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ATCs) గా మార్చామని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. సుమారు 4 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఈ సెంటర్లలో అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత యువతకు అంతర్జాతీయ స్థాయి స్కిల్స్ నేర్పించి, అటు విదేశాల్లోనూ, ఇటు స్థానికంగానూ ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు.