Reading Time: < 1 minute

బ్రిడ్జి గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతి

Caption of Image.

తాండూరు, వెలుగు: నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి గుంతలో పడి ఏఆర్ కానిస్టేబుల్ మృతిచెందాడు. బషీరాబాద్ మండలం రెడ్డిఘనాపూర్‌‌‌‌కు చెందిన నర్సింలు(30) ఏఆర్ కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌‌‌‌లో విధులు నిర్వహిస్తూ చీఫ్ విప్ మహేందర్ రెడ్డికి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఆదివారం తాండూరులో జరిగిన భద్రేశ్వర జాతర లంకాదహన ఉత్సవాల్లో విధులు నిర్వహించిన అనంతరం ఇంటికి బయల్దేరాడు. 

ఈ క్రమంలో యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ గ్రామ సమీపంలో బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు బైక్‌‌‌‌తో పాటు పడిపోయాడు. అందులో నీరు ఉండడంతో ఊపిరాడక మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

©️ VIL Media Pvt Ltd.