Reading Time: < 1 minute
Vaani Kapoor Turns Up The Heat In Two Piece Outfit Amid Career Struggles

కొన్నాళ్ల నుంచి బాలీవుడ్‌ హాట్ బ్యూటీ వాణీ కపూర్ స్టార్ డమ్ కోసం వెయిట్ చేస్తోంది. కానీ ఆ అదృష్టం మాత్రం దక్కడం లేదు. ఆఫర్స్, హిట్స్ లేక అల్లాడిపోతున్నారు. తనతో పాటు కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె బెస్టీ రాశీ ఖన్నా తెలుగు, తమిళ్లో స్టార్ డమ్ తెచ్చుకుని.. బాలీవుడ్‌లో ఆఫర్స్ అందుకుంటోంది. కానీ వాణీ మాత్రం సరైన అవకాశాల్లేక స్ట్రగుల్స్‌ ఫేస్‌ చేస్తూనే ఉంది. కెరీర్ స్టార్ట్ చేసి పుష్కర కాలం అవుతున్నా.. చెప్పుకోదగిన హిట్స్ లేవు.

శుద్ద్ దేశీ రొమాన్స్, బేఫికర్, వార్ లాంటి చిత్రాలు వాణీ కపూర్‌కు స్టార్‌డమ్ తెచ్చిపెట్టినా.. ఆ తర్వాత వరుస ప్లాపులు ఆమె కెరీర్‌ను డైలమాలో పడేశాయి. గత ఏడాది రైడ్ 2తో గట్టెక్కానని ఫీలైనా.. ఆ వెంటనే వచ్చిన అబీర్ గులాల్ మూవీ వాణీ ఇమేజ్ డ్యామేజ్ చేసింది. వరుస ప్లాపులు వాణీ కెరీర్‌ను గ్రాఫ్ డౌన్ ఫాల్ చేయడంతో పాటు, ఆఫర్లు కూడా తగ్గేలా చేశాయి. హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలతో నటించినా.. ఇప్పుడు చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవు.

Also Read: Lavanya Drunk Driving Case: నేను సెలబ్రిటీని, నన్నెవడ్రా ఆపేది.. మద్యం మత్తులో లావణ్య హంగామా!

ఓవైపు హిట్స్, మరోవైపు ఆఫర్స్ లేక అల్లాడిపోతున్న వాణీ కపూర్‌ సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తున్నారు. టూ పీస్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిస్తూ.. సమ్మర్‌ను మరింత హీట్ ఎక్కిస్తున్నారు. తన స్టన్నింగ్ లుక్స్‌తో యూత్‌తో పాటు మూవీ మేకర్స్ అటెన్షన్ గ్రాబ్ పనిలో ఈ డిల్లీ గాళ్ ఉన్నారు. సిల్వర్ స్క్రీన్‪పై గ్లామర్ షోకు అడ్డుచెప్పని వాణీ.. ఇప్పుడు నెట్టింట్లో కూడా టూ పీస్ అవుట్ ఫిట్‌లో ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటున్నారు. వాణీ మళ్లీ ట్రాక్‌లోకి వస్తారేమో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Vaani Kapoor (@vaanikapoor)