Reading Time: 2 minutes

IPL 2026: ఈసారి కొత్త రోల్ లో కనిపించనున్న కేఎల్ రాహుల్.. 

Caption of Image.

IPL 2026: మరో 10 రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఎడిషన్ ప్రారంభం కాబోతుంది. దీంతో ఇప్పిటికే అన్ని జట్లు సన్నాహాలు స్టార్ట్ చేశాయి. ఇందులో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ప్రాక్టీస్ సెషన్స్ ఏర్పాటు చేసింది. దీంతో ఆటగాళ్లు అందరు జోరుగా కసరత్తు చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కేఎల్ రాహుల్ జట్టు అవసరాలకు అనుగుణంగా వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. దాంతో పరిస్థితులకు అనుగుణంగా తన ఆటను మార్చుకునే సామర్థ్యం కారణంగా టీమ్స్ అతనిపై నమ్మకం పెట్టుకున్నాయి. దీంతో తరుచుగా బ్యాటింగ్ క్రమంలో మార్పులు చేయడం కేఎల్ రాహుల్ కి సవాళ్లను విసురుతుంది.  గత ఐపీఎల్ సీజన్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరచుగా బ్యాటింగ్ క్రమాన్ని మార్చి, ఆటగాళ్లను వేర్వేరు స్థానాల్లో ఆడించారు. 

దీంతో కొన్ని మ్యాచ్‌లలో జట్టు బ్యాటింగ్‌లో స్థిరత్వంగా ఉండలేకపోయింది. మిగతా బ్యాటర్లు వచ్చిన స్థానాల్లో రాణించలేకపోయారు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా తన ఆటను మార్చుకుని మంచి ప్రదర్శన కనబరిచారు. గత సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లలో 539 పరుగులు చేయగా.. అందులో 149.72 స్ట్రైక్ రేట్‌తో పాటు సగటు 53.90ని నమోదు చేశాడు. అలాగే ఓపెనర్‌గా వచ్చినప్పుడు అతని ప్రదర్శన ఎంతో మెరుగ్గా ఉంది. కేవలం 4 మ్యాచ్‌లలో 235 చేశాడు.. ఆ ఇన్నింగ్స్‌లలో అతని స్ట్రైక్ రేట్ 164తో పాటు అవరేజ్ 34.10 శాతం ఉంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేఎల్ రాహుల్ బ్యాటింగ్ స్థానంపై అనవసర గందరగోళం సృష్టించొద్దని మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సూచించారు. అతను ఓపెనర్‌గా అద్భుత రికార్డు ఉందని చెప్పారు. గత నాలుగు సంవత్సరాల్లో అతని స్ట్రైక్ రేట్ కూడా గణనీయంగా పెరిగిందని తెలిపాడు. కేఎల్ బ్యాటింగ్ పై జట్టు అవసర గందరగోళానికి లోనవకూడదు అని పేర్కొన్నారు. రాహుల్ టాప్ ఆర్డర్‌లో తన సహజ ఆట ఆడినప్పుడు అత్యుత్తమైన ప్రదర్శిన  చేస్తాడని చెప్పారు. సమస్య ఏమిటంటే అతన్ని నాలుగో స్థానంలో లేదా ఫినిషర్ పాత్రలో ఆడమని టీమ్ జట్లు అడుగుతుంది.. దీని వలన టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ దెబ్బ తింటుందన్నారు. ఈసారి జట్టులో డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా ఉన్నారు కాబట్టి అతడ్ని ఓపెనర్ గా పంపాలని కైఫ్ సూచించారు. 

©️ VIL Media Pvt Ltd.