Reading Time: < 1 minute

శాంతికి ఇది సమయం కాదు.. యూఎస్, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ఓడించాల్సిందే: మొజ్తబా

Caption of Image.

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కచ్చితంగా ఓడించాల్సిందేనని ఇరాన్ నూతన సుప్రీం లీడర్ అయతుల్లా మొజ్తబా ఖమేనీ పిలుపు నిచ్చారు. అమెరికాతో ఉద్రిక్తతలను తగ్గించుకోవాలనే ప్రతిపాదనలను ఆయన తిరస్కరించారు.

శాంతి చర్చలకు ఇది సమయం కాదని  ఆయన స్పష్టం చేశారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఈ మేరకు మధ్యవర్తుల ద్వారా వచ్చిన ప్రతిపాదనలను మొజ్తబా తిరస్కరించినట్లు ఒక ఉన్నత స్థాయి అధికారి వెల్లడించారు.

అమెరికా, ఇజ్రాయెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ముందుగా “మోకరిల్లేలా” చేయాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలిపారు. “అమెరికా, ఇజ్రాయెల్ మోకరిల్లి, తమ ఓటమిని అంగీకరించి, పరిహారం చెల్లించే వరకు శాంతికి చోటు లేదు” అని ఆయన అన్నట్లు సదరు అధికారి పేర్కొన్నారు.అమెరికాతో కాల్పుల విరమణ లేదా ఉద్రిక్తతల తగ్గింపు కోసం రెండు దేశాలు ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. 

©️ VIL Media Pvt Ltd.