July 10, 2026

Sanju Samson: సంజు శాంసన్ అగ్రెసివ్ బ్యాటింగ్.. CSK కప్ కొట్టడం ఖాయం

Sanju Samson: సంజు శాంసన్ అగ్రెసివ్ బ్యాటింగ్.. CSK కప్ కొట్టడం ఖాయం
Reading Time: 2 minutes

Sanju Samson: సంజు శాంసన్ అగ్రెసివ్ బ్యాటింగ్.. CSK కప్ కొట్టడం ఖాయం

Caption of Image.

Sanju Samson: త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో తన 6వ టైటిల్‌ కోసం చెన్నై సూపర్ కింగ్స్ సిద్ధమవుతోంది. ఈ సీజన్‌లో సంజూ శాంసన్ జట్టులో చేరడంతో CSK బ్యాటింగ్ మరింత బలపడింది. దీనిపై మాజీ క్రికెటర్ పియుష్ చావ్లా మాట్లాడుతూ.. చెన్నై జట్టుకి ఉన్న ఓపెనింగ్ సమస్య సంజు శాంసన్ ఎంట్రీతో పోయాయి.. శాంసన్ మ్యాచ్ విన్నర్.. టీ20 వరల్డ్ కప్‌లో వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పై మూడు మ్యాచుల్లో అతడు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారని అభినందించారు. ఐపీఎల్ ప్రారంభానికి అతడు ఫారమ్‌లో ఉండటం.. ఇది CSK అభిమానులకు శుభవార్త.. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది.. ఓపెనింగ్‌లోనే ఆగ్రెసివ్ బ్యాటింగ్ CSKకు చాలా ఉపయోగకరంగా మారనుందని చెప్పుకొచ్చారు. 

తమ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గత సీజన్‌లో పవర్ ప్లేలోనే త్వరగా వికెట్లు కోల్పోయి.. స్ట్రగుల్ అయ్యిందని పీయూష్ చావ్లా పేర్కొన్నారు. ఆయుష్ మత్రే లాంటి యంగ్ క్రికెటర్లు రావటంతో CSK పరుగులు చేయడం మొదలెట్టింది.. ఇప్పుడు ఆ జట్టులో శాంసన్ ఉండటంతో ఓపెనింగ్ లోనే బ్లాక్‌బస్టర్ ట్రేడ్‌గా ఉంటుందన్నారు. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్‌లో పాయింట్స్ పట్టికలో చివరగా నిలిచింది. అయినప్పటికీ, మినీ ఆక్షన్‌లో అద్భుతమైన ప్లేయర్స్ ని తీసుకుని జట్టుని బలమైన స్వ్కాడ్ గా సిద్దం చేసుకుంది.. 6వ టైటిల్ గెలుచుకోవాలనే ఆత్మవిశ్వాసంతో ఈసారి బరిలోకి దిగుతుందని వెల్లడించారు. 

ALSO READ : CSK ఫ్యాన్స్కి షాకింగ్ న్యూస్.. ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్!

మాజీ భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. సంజు శాంసన్ చెన్నై జట్టులో చేరవడంతో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మీద ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అలాగే MS ధోనీ వారసత్వాన్ని కొనసాగిస్తూ IPLలో కెప్టెన్సీ చేయడం సులభం కాదు.. కానీ ధోనీ మద్దతు, శాంసన్  సహాయంతో రుతురాజ్‌కు చాలా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. CSK యువ ఆటగాళ్లను కూడా తీసుకుని భవిష్యత్తు కోసం వారిని సిద్ధం చేస్తుందన్నారు. జట్టులో డేవాల్డ్ బ్రెవిస్, ఊర్విల్ పటేల్, శివం దూబే, సర్ఫరాజ్ ఖాన్ వంటి ఎక్సైటింగ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు.. వారు ఈ సీజన్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలని పఠాన్ చెప్పుకొచ్చారు.  

©️ VIL Media Pvt Ltd.