July 8, 2026

AA23 Update: లోకేష్ స్టైల్‌ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్‌ప్రైజ్!

AA23 Update: లోకేష్ స్టైల్‌ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్‌ప్రైజ్!
Reading Time: < 1 minute
Aa23 Title Teaser Update Allu Arjun Lokesh Kanagaraj Film Set To Surprise Fans Soon

AA23 Title Teaser To Released Soon: ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించిన బన్నీ.. ప్రస్తుతం స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా.. ఇప్పటికే బన్నీ తదుపరి ప్రాజెక్ట్ ‘AA23’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘AA23’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినిమా టైటిల్ టీజర్ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ టీజర్‌కు సంబంధించిన చిత్రీకరణ కూడా ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. లోకేష్ తన ప్రత్యేక శైలికి తగ్గట్టుగా ఈ టీజర్‌ను హై-ఆక్టేన్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో, అత్యంత ఇంటెన్స్‌గా రూపొందించారట. అల్లు అర్జున్‌ను ఇప్పటివరకు చూడని కొత్త అవతార్‌లో చూపించేలా టీజర్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఈ టీజర్ విడుదలైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయం.

‘AA23’ రెగ్యులర్ షూటింగ్‌ను 2026 దసరా సందర్భంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనుండగా.. స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నారు. అయితే ఇప్పటివరకు టైటిల్ టీజర్ లేదా విడుదల తేదీపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే మేకర్స్ నుంచి స్పష్టత వచ్చే అవకాశముంది. అల్లు అర్జున్ అభిమానులు అధికారిక అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.